ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 122 ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివే-notification for filling 122 vacancies in eluru medical college and hospital ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 122 ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివే

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 122 ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివే

ఏలూరు మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 122 పోస్టులను రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. ఈ పోస్టులకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జూన్ 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఏలూరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

ఏలూరు మెడికల్ కాలేజీ పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 పోస్టులు, ప్రభుత్వ ఆసుపత్రిలో 87 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అన్ని కలిపి 122 పోస్టులున్నాయి.

ఈ ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయన్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జూన్ 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హత కల అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ ను https://gmceluru-ap-gov.com/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఖాళీల వివరాలు…

మెడికల్ కాలేజీలో స్టోర్ కీపర్, కంప్యూటర్ ప్రోగామర్, ఎలక్ట్రిక్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు ఉన్నాయి. ఇక ఆస్పత్రిలో చూస్తే రేడియోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోలజీ టెక్, క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగామర్, ఎలక్ట్రిక్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, స్పీచ్ థెరపిస్ట్, స్టోర్ అటెండెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు మరికొన్ని ఖాళీలు ఉన్నాయి.

పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. పోస్టును బట్టి జీతాన్ని నిర్ణయించారు. వంద మార్కులను ప్రతిపాదికగా తీసుకున్ని తుది జాబితాను ప్రకటిస్తారు. ఇందులో విద్యా అర్హతల్లో సాధించిన మార్కులు, పని చేసిన అనుభవంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

కావాల్సిన పత్రాలు

  • పదో తరగతి మార్కుల మెమో
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఈడబ్యూఎస్ ధ్రువీకరణపత్రం
  • స్పోర్ట్ కోటా వాళ్లు సంబంధిత సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  • విద్యా అర్హతల మెమోలు
  • మెడికల్ కౌన్సెల్ రిజిస్ట్రేషన్
  • పాస్ పోర్టు సైజ్ ఫొటోలు
  • దరఖాస్తు ఫీజు కింద డీడీ
  • అప్రెంటిస్ సర్టిఫికెట్

పూర్తి చేసిన దరఖాస్తులను “ప్రిన్సిపాల్ కార్యాలయం, డా.ఎల్లాప్రగడ సుబ్బారావు, ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు చిరునామా”కు పంపించాల్సి ఉంటుంది. https://gmceluru-ap-gov.com/ వెబ్ సైట్ లో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్