AP Medical Jobs : తూర్పు గోదావ‌రి జిల్లాలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. పూర్తి వివ‌రాలు ఇవే-notification for contract and outsourcing jobs in east godavari district ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Medical Jobs : తూర్పు గోదావ‌రి జిల్లాలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. పూర్తి వివ‌రాలు ఇవే

AP Medical Jobs : తూర్పు గోదావ‌రి జిల్లాలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. పూర్తి వివ‌రాలు ఇవే

HT Telugu Desk HT Telugu

AP Medical Jobs : తూర్పు గోదావ‌రి జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల‌ భర్తీ నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. మొత్తం 30 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిల్లో 6 రకాల పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వేతనం ఇస్తారు. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ శాఖ ఆధ్వ‌ర్యం తూర్పుగోదావ‌రి జిల్లా హెల్త్ ఇన్ట్సిట్యూష‌న్‌లో ఉద్యోగాల‌ భర్తీ నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ మార్చి 21గా నిర్ణ‌యించారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్నఅభ్య‌ర్థులు స‌కాలంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తుల్లో భ‌ర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివ‌రాలు..

మొత్తం 30 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో మూడు పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

ల్యాబ్ టెక్నిషియ‌న్‌-1

ఆడియోమెట్రిషియన్-2

అవుట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిలో 27 పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

బయో స్టాటిస్టిషియన్ -1

థియేట‌ర్ అసిస్టెంట్‌-1

జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ)-22

ఆఫీస్ స‌బార్డినేట్-3

వేత‌న వివ‌రాలు..

నెల‌వారీ జీతాలు ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.

1. ల్యాబ్ టెక్నిషియ‌న్‌- రూ. 32,670

2. ఆడియోమెట్రిషియన్- రూ.32,670

3. బయో స్టాటిస్టిషియన్ -రూ.18,500

4. థియేట‌ర్ అసిస్టెంట్‌- రూ.15,000

5. జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) - రూ.15,000

6. ఆఫీస్ స‌బార్డినేట్- రూ.15,000

అర్హ‌త‌లు..

1.ల్యాబ్ టెక్నిషియ‌న్- డీఎంఎల్‌టీ లేదా బీఎస్సీ (ఎంఎల్‌టీ) ఉత్తీర్ణ‌త సాధించాలి. ఇంట‌ర్మీడియ‌ట్ ఒకేష‌నల్ అయితే, ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అప్రెంటీషిప్ త‌ప్ప‌నిస‌రిగా చేయాలి. ఏపీపీఎంబీలో త‌ప్ప‌నిసరిగా రిజిస్టర్ కావాలి.

2.ఆడియోమెట్రిషియన్- ఇంట‌ర్మీడియ‌ట్, లేదా దానికి స‌మాన‌మైన విద్యా అర్హ‌త ఉండాలి.

3 బయో స్టాటిస్టిషియన్- మాథ్య‌మెటిక్స్‌, ఎకనామిక్స్‌, స్టాట‌స్టిక్స్‌లో డిగ్రీ పూర్తి చేయాలి.

4.థియేట‌ర్ అసిస్టెంట్- ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించాలి. న‌ర్సింగ్‌లో ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.

5.జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ)- ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించాలి.

6.ఆఫీస్ స‌బార్డినేట్ః- ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించాలి.

వ‌యో ప‌రిమితి..

2024 సెప్టెంబ‌ర్‌ 1 నాటికి వ‌య‌స్సు 18 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వ‌య‌స్సు దాట‌కూడ‌దు.

అప్లికేష‌న్ ఫీజు..

అప్లికేష‌న్ ఫీజు ఓసీ అభ్య‌ర్థుల‌కు రూ.350, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.250 ఉంటుంది. దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు అప్లికేష‌న్ ఫీజు నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. ఫీజు చెల్లించడానికి డీడీ తీసీ.. దానిని అప్లికేష‌న్‌కు జ‌త‌చేయాలి.

ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాల్సినవి..

1. ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా

2. పోస్టుల‌కు సంబంధించిన అర్హ‌త స‌ర్టిఫికేట్‌

3. అర్హ‌త ప‌రీక్ష‌కు హాజ‌రైన ఆధారం

4. అన్ని సంవ‌త్స‌రాలు మార్కుల లిస్టులు

5. ఏపీ పారామెడిక‌ల్ బోర్డు, అలైడ్ హెల్త్ కేర్ సైన్స్‌, ఇత‌ర కౌన్సిల్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌

6. నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికేట్లు

7. కుల ధ్రువీక‌ర‌ణ ప్ర‌తం

8. దివ్యాంగు అభ్య‌ర్థులు స‌ద‌రం స‌ర్టిఫికేట్‌

9. స‌ర్వీస్ స‌ర్టిఫికేట్‌

10. ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు సంబంధిత స‌ర్టిఫికేట్‌

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి?..

ద‌ర‌ఖాస్తు ఫార‌మ్ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో అందుబాటులో ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుతో పాటు విద్యార్హ‌త‌లు, ఉద్యోగ అనుభ‌వాలతో కూడిన జిరాక్స్ కాపీ సెట్‌ను సంబంధింత కార్యాలయంలో మార్చి 21 తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అర్హ‌త‌లు, పోస్టు రిజ‌ర్వేష‌న్లు త‌దిత‌ర అంశాల గురించి పూర్తి వివరాలకు అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను ద్వారా తెలుసు కోవచ్చు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu Desk