ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే-notification for 49 faculty posts on contract basis in ap social welfare residential educational institutions ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 49 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. జూన్ 11వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు.

ఏపీ సాంఘిక సంక్షేమలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో49 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటన్నింటిని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఫ్యాకల్టీ పోస్టులు…

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ సెంటర్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఐఐటీ, నీట్ కోర్సులకు కోచింగ్ ఇవ్వడానికి అనుభవం ఉన్న ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 10 జిల్లాల పరిధిలో ఉన్న పలు కేంద్రాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టుల భర్తీకి మే 26వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు https://swreis.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫార్మట్, విద్యార్హతలు, అనుభవం, దరఖాస్తు ఫీజు, పూర్తి వివరాలన్నీ కూడా మే 26 నుంచి అందుబాటులోకి వస్తాయి. జూన్ 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఖాళీల వివరాలు
ఖాళీల వివరాలు

త్వరలోనే సీట్ల కేటాయింపు:

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పటికే ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ర్యాంక్ కార్డులను అందుబాటులో ఉంచారు.

ఇంటర్ ఎంట్రెన్స్ ఫలితాల్లో విశాఖ జిల్లాకు చెందిన గీతిక ఫస్ట్ ర్యాంక్ సాధించగా… కర్నూలు జిల్లాకు చెందిన శృతి, హాసినా… రెండు, మూడు ర్యాంకులు సాధించారు. అయితే ఇంకా సీట్ల కేటాయింపు జరగలేదు. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను కేటాయిస్తారు. https://apbragcet.apcfss.in/Sw-index?id=11 లింక్ పై క్లిక్ చేసి సీటు అలాట్ మెంట్ అర్డన్ కాపీని పొందవచ్చు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

  • ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ఇంటర్ అడ్మిషన్లపై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ ర్యాంక్ కార్డు ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.
  • గేట్ డేటాపై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్