వాకిన్​ ఇంటర్వ్యూలతో ప్రభుత్వ ఉద్యోగాలు- ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​ ప్రక్రియ మొదలు..-nmdc steel recruitment 2025 registration begins for 934 posts see full details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  వాకిన్​ ఇంటర్వ్యూలతో ప్రభుత్వ ఉద్యోగాలు- ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​ ప్రక్రియ మొదలు..

వాకిన్​ ఇంటర్వ్యూలతో ప్రభుత్వ ఉద్యోగాలు- ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​ ప్రక్రియ మొదలు..

Sharath Chitturi HT Telugu

ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ 2025 అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో 900కుపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ వివరాలు..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అలర్ట్​! వివిధ పోస్టుల భర్తీకి నేషనల్​ మినరల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ స్టీల్​ లిమిటెడ్​​ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్​ఎండీసీ స్టీల్​ అధికారిక వెబ్​సైట్​ nmdcsteel.nmdc.co.in లో అప్లై చేసుకోవచ్చు.

ఈ దఫా రిక్రూట్​మెంట్​లో మొత్తం 934 పోస్టులను భర్తీ చేయనుంది ఎన్​ఎండీసీ స్టీల్​. అప్లికేషన్​కి చివరి తేదీ మే 8 2025 అని గుర్తుపెట్టుకోవాలి.

ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ 2025..

"ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ 2025కి అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు వివిధ పోస్టుల అర్హత ప్రమాణాలను క్షుణ్ణంగా చదవాలి. నోటిఫికేషన్​ని పూర్తిగా తెలుసుకోవాలి. సంతృప్తి చెందితేనే అప్లికేషన్​ దాఖలు చేయాలి. అర్హత ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు మా వద్దకు ఎవరు రాకూడదు. పోస్టులకు అప్లై చేస్తున్నప్పుడు అభ్యర్థులు ఎలిజిబులిటీతో పాటు ఇతర క్రైటీరియాలను పూర్తి చేసి ఉండాలి. ఇచ్చిన సమాచారం నిజమైనవే అని ధ్రువీకరించాలి," అధికారిక నోటిఫికేషన్​ పేర్కొంది.

అప్లికేషన్​ ఫీజు..

ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్​ సర్వీస్​మెన్​ కేటగిరీ అభ్యర్థులకు- రూ. 0 (సంబంధిత డాక్యుమెంట్లను చూపించాలి. లేకపోతే అప్లికేషన్​ రిజెక్ట్​ అవుతుంది.)

ఇతరులకు- రూ. 500 (నాన్​ రీఫండెబుల్​).

ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ 2025 ఆన్​లైన్​ అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎంపిక ప్రక్రియ..

రాయ్​పూర్​, భువనేశ్వర్​, రూర్కెలా, బొకారో, దుర్గాపూర్​, హోస్​పేట్​, ఝార్సుగుడా వద్ద వాకిన్​ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫిల్​ చేసేడప్పుడు అభ్యర్థులు పైన పేర్కొన్న ప్రాంతాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. అవైలబులిటీ బట్టి తుది అలోకేషన్​ ఉంటుంది. నోటిఫికేషన్​లో చెప్పినట్టు వెరిఫైడ్​ డాక్యుమెంట్లు ఉన్న వారి అప్లికేషన్లు మాత్రమే ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తాయి. వాకిన్​ ఇంటర్వ్యూ ఆధారంగా ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​లో ఉద్యోగం లభిస్తుంది.

అయితే ఇది కాంట్రాక్ట్​ ఉద్యోగం అని గుర్తించాలి. 3ఏళ్లు లేదా 60ఏళ్లు (ఏది ముందు వస్తే అది) కాంట్రాక్ట్​ ఇస్తారు. సంస్థ అవసరాల బట్టి, పర్ఫార్మెన్స్​ ఆధారంగా కాంట్రాక్ట్​ కాల వ్యవధిని పెంచొచ్చు.

పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ 2025 నోటిఫికేషన్​ని చదవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం