NIT Warangal Recruitment 2025 : వరంగల్ 'నిట్' నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - కేవలం ఇంటర్వ్యూనే..!
NIT Warangal Recruitment 2025 Updates : వరంగల్ ‘నిట్’ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ ఇన్‌వెస్టిగేటర్స్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టును రిక్రూట్ చేయనున్నారు. మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఫిబ్రవరి 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
వరంగల్‌లోని ‘నిట్’ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఐదు ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఇందులో నాలుగు ఫీల్డ్ ఇన్‌వెస్టిగేటర్స్, ఒక రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దరఖాస్తులు విధానం - ఖాళీల వివరాలు
ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ ద్వారా సమర్పించాలి. ఎంపికైన వారు ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వరంగల్ నిట్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఫీల్డ్ ఇన్వెస్టిగెటర్స్ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలి. ఎంపికైన వారి నెలకు రూ. 20 వేల జీతం చెల్లిస్తారు. ఫిబ్రవరి 25వ తేదీలోపు సాఫ్ట్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే 9000453743 నెంబర్ ను సంప్రదించవచ్చు.
రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారు ఎనిమిది నెలలు పని చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు భాషాలపై నైపుణ్యం ఉండాలి. సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల జీతం చెల్లిస్తారు. ఫిబ్రవరి 25వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఎంపిక విధానం….
దరఖాస్తు ఫామ్ లను వరంగల్ నిట్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన తర్వాత vrdevi@nitw.ac.in కు మెయిల్ ద్వారా పంపాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9000453743 నెంబర్ లేదా vrdevi@nitw.ac.in, rahult@nitw.ac.in కు మెయిల్ చేయవచ్చు.
ఎంపిక విధానం దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. వీటి ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన వారికి మెయిల్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.
సంబంధిత కథనం