NIT Warangal Recruitment 2025 : వరంగల్ నిట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - మంచి జీతం, దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!
NIT Warangal Recruitment 2025 : వరంగల్ నిట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు రేపటి(ఫిబ్రవరి 7)తో పూర్తి కానుంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ధ్రువపత్రాల పరిశీలనతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి వరంగల్‌లోని ‘నిట్’ ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం ఆరు ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అయితే ఆన్ లైన్ దరఖాస్తుల గడువు రేపటి(ఫిబ్రవరి 07, 2025)తో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఖాళీల వివరాలు….
ఈ నోటిఫికేషన్ లో భాగంగా విజిటింగ్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వజర్)- 01, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ 1, విజిటింగ్ కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ - 01, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ - 01, స్టూడెంట్ కౌన్సెలర్ - 01, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(PRO) -1 పోస్టును భర్తీ చేయనున్నారు. అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. ఎంపికైన వారు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. నెల జీతం రూ. 50 వేల నుంచి రూ. 70 వేల మధ్య ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.
దరఖాస్తు విధానం ఇలా….
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిట్ వరంగల్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులోనూ contractual స్టాఫ్ పై నొక్కాలి.
- ఇక్కడ నోటిఫికేషన్ల లిస్ట్ కనిపిస్తుంది. జనవరి 8వ తేదీ పక్కన ఉన్న లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసుకోవచ్చు.
- చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫామ్ కాపీని పొందవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - నిట్ వరంగల్, తెలంగాణ రాష్ట్రం.
- మొత్తం ఖాళీలు - 6
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులకు చివరి తేదీ - ఫిబ్రవరి 07, 2025. (రాత్రి 11.59 గంటల లోపు అప్లికేషన్ సమర్పించాలి)
- ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
- ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచారు
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే recruit_admn@nitw.ac.in మెయిల్ చేయవచ్చు.
- సాంకేతిక సమస్యలు ఉంటే recruit@nitw.ac.in మెయిల్ ను సంప్రదించవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ..
సంబంధిత కథనం