నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్! నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల భర్తీకి అప్లికేషన్ని స్వీకరిస్తోంది ఎన్ఐసీఎల్. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్ఐసీఎల్ అధికారిక వెబ్‌సైట్ nationalinsurance.nic.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 3, 2025 అని గుర్తుపెట్టుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఖాళీల వివరాలు:
అర్హత ప్రమాణాలు:
ఎన్ఐసీఎల్ రిక్రూట్మెంట్ 2025లో ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలను వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవాలి (లింక్ కింద ఇవ్వడం జరిగింది). అభ్యర్థుల వయోపరిమితి మే 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థి 02.05.1995 కంటే ముందు, 01.05.2004 కంటే తర్వాత (ఈ రెండు తేదీలతో సహా) జన్మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
ఎన్ఐసీఎల్ రిక్రూట్మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ రెండు దశల పరీక్షలను కలిగి ఉంటుంది - ఫేజ్ I (ప్రిలిమినరీ పరీక్ష), ఫేజ్ II (మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ).
ప్రిలిమినరీ పరీక్ష: ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్‌లతో (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) కూడి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు (అన్ని విభాగాలకు వర్తిస్తుంది). ఈ పరీక్ష 60 నిమిషాల వ్యవధితో 3 విభాగాలుగా (ప్రతి విభాగానికి ప్రత్యేక సమయాలు) ఉంటుంది.
మెయిన్ పరీక్ష: ఇందులో 250 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్ (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు), 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్‌లు రెండూ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. అభ్యర్థులు కంప్యూటర్‌లో టైప్ చేయడం ద్వారా డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు సమాధానం ఇవ్వాలి. ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు.
అభ్యర్థుల తుది స్కోరు.. ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్). ఇంటర్వ్యూలో పొందిన స్కోర్‌ల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
అన్ని వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1000/-. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వర్గానికి చెందిన అభ్యర్థులకు రూ. 250/-.
ఎన్ఐసీఎల్ రిక్రూట్మెంట్ 2025 వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎన్ఐసీఎల్ రిక్రూట్మెంట్ 2025 అప్లికేషన్‌కి డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం