గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. ప్రభుత్వ రంగ సంస్థలో 500 అప్రెంటిస్ ఖాళీలు!-niacl apprentice recruitment 2025 golden chance for graduates apply for 500 posts at newindiacoin ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. ప్రభుత్వ రంగ సంస్థలో 500 అప్రెంటిస్ ఖాళీలు!

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. ప్రభుత్వ రంగ సంస్థలో 500 అప్రెంటిస్ ఖాళీలు!

Anand Sai HT Telugu

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 500 అప్రెంటిస్ పోస్టులకు నియామకాలను ప్రకటించింది. అభ్యర్థులు అతి త్వరలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకుంటే.. ఇది మీకు మంచి అవకాశం అవుతుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ newindia.co.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 6 నుండి జూన్ 20 వరకు కొనసాగుతుంది.

దరఖాస్తుకు అర్హతలు

ఈ నియామకం ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండటం అవసరం. దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. అయితే రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడానికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 944 రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.708గా నిర్ణయించారు. దివ్యాంగ అభ్యర్థులకు రూ. 472గా ఉంది.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో చేస్తారు. మెుదట రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత స్థానిక భాషా పరీక్ష, తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరకు వైద్య పరీక్ష ఉంటుంది. అన్ని దశలలో విజయం సాధించిన అభ్యర్థులను అప్రెంటిస్‌లుగా ఎంపిక చేసి నెలకు రూ.9000 స్టైఫండ్ ఇస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు, అభ్యర్థులు ఆధార్ కార్డ్, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ లేదా డిప్లొమా, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం స్కాన్ చేసిన కాపీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే) వంటి కొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి.

ఎలా అప్లై చేయాలి?

దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. అభ్యర్థులు newindia.co.in వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లింక్‌ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయి సమాచారాన్ని నింపాలి. తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రింటవుట్ తీసుకొండి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్