నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్, అప్లికేషన్ ఫ్రీ!-nhai recruitment 2025 apply for deputy manager posts selection without exam and no application fee ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్, అప్లికేషన్ ఫ్రీ!

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్, అప్లికేషన్ ఫ్రీ!

Anand Sai HT Telugu

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ నడుస్తోంది. పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందవచ్చు.

నేషనల్ హైవే అథారిటీ జాబ్స్

ీరు సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం ఓ గుడ్‌న్యూస్ ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) 60 పోస్టులకు ప్రత్యక్ష నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామకంలో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము ఉండదు.

60 పోస్టులు భర్తీ

ఈ నియామకంలో మొత్తం 60 పోస్టులు భర్తీ చేస్తారు. వీటిలో 27 పోస్టులు జనరల్ కేటగిరీకి, 13 ఓబీసీకి, 9 ఎస్సీకి, 4 ఎస్టీకి, 7 ఈడబ్ల్యూఎస్‌కి రిజర్వ్ అయి ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిపై క్లిక్ చేసి, అవసరమైన సమాచారాన్ని పూరించండి. పత్రాలను అప్‌లోడ్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. దాని ప్రింటవుట్‌ను సేవ్ చేసుకోండి.

అర్హతలు

గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బిటెక్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గేట్ స్కోరును కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ(నాన్-క్రీమీ లేయర్)కు 3 సంవత్సరాలు సడలింపు లభిస్తుంది.

గేట్ స్కోర్

ఎంపిక పూర్తిగా గేట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది. అంటే ఎటువంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. మీ గేట్ స్కోర్ మాత్రమే మీ అపాయింట్‌మెంట్‌ను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ

ఈ నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 మే 10 నుండి ప్రారంభమైంది. చివరి తేదీ 2025 జూన్ 9(సాయంత్రం 6 గంటల వరకు)గా ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్ vacancy.nhai.orgని సందర్శించడం ద్వారా ఫారమ్ నింపవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్, సంతకం, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ, గేట్ స్కోర్‌కార్డ్ వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్