NG Ranga University Jobs : ఎన్జీ రంగా వర్సిటీ పరిధిలో 15 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, కేవ‌లం ఇంట‌ర్వ్యూతోనే-ng ranga university centers recruitment 15 vacancies interview based selection ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ng Ranga University Jobs : ఎన్జీ రంగా వర్సిటీ పరిధిలో 15 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, కేవ‌లం ఇంట‌ర్వ్యూతోనే

NG Ranga University Jobs : ఎన్జీ రంగా వర్సిటీ పరిధిలో 15 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, కేవ‌లం ఇంట‌ర్వ్యూతోనే

HT Telugu Desk HT Telugu
Updated Feb 14, 2025 05:48 PM IST

NG Ranga University Jobs : ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలో 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేవ‌లం ఇంట‌ర్వ్యూల‌తోనే పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాల‌ను కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు.

ఎన్జీ రంగా వర్సిటీ పరిధిలో 15 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, కేవ‌లం ఇంట‌ర్వ్యూతోనే
ఎన్జీ రంగా వర్సిటీ పరిధిలో 15 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, కేవ‌లం ఇంట‌ర్వ్యూతోనే

NG Ranga University Jobs : ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ)లో వివిధ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. రాష్ట్రంలోని వివిధ సెంట‌ర్స్‌లో ప‌ని చేసేందుకు మొత్తం 15 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా, కేవ‌లం ఇంట‌ర్వ్యూల‌తోనే పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాల‌ను కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు.

ఉద్యోగాలు

1. ఫిజిక‌ల్ డైరెక్టర్ (మ‌హానంది)-1

2. టీచింగ్ అసోసియేట్‌ (నైరా)-1

3. టీచింగ్ అసిస్టెంట్ (నైరా)-2

4. టీచింగ్ అసిస్టెంట్ (బాప‌ట్ల)-1

5. డ్రోన్ పైల‌ట్ కం ట్రైనర్స్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) -4

6. ప్రోగ్రామ్ ఇంజ‌నీర్ కమ్ ఆర్‌పీటీవో అడ్మిన్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు)-1

7. ఐఓటీ, ఏఐ & ఎంఎల్ & 3డీ ఇంజ‌నీర్ కం డ్రోన్ ట్రైన‌ర్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు)-1

8. రీసెర్చ్ అసోసియేట్ (అన‌కాప‌ల్లి)-2

9. రీసెర్చ్ అసోసియేట్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) -1

10. రీసెర్చ్ అసోసియేట్ (తిరుప‌తి)-1

జీత‌భ‌త్యాలు

1. ఫిజిక‌ల్ డైరెక్టర్ (మ‌హానంది)- మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.33,000, పీహెచ్‌డీ చేసిన వారికి రూ.38,000

2. టీచింగ్ అసోసియేట్‌ (నైరా)-మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.61,000, పీహెచ్‌డీ చేసిన వారికి రూ.67,000

3. టీచింగ్ అసిస్టెంట్ (నైరా)- రూ.27,000

4. టీచింగ్ అసిస్టెంట్ (బాప‌ట్ల)- మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.61,000, పీహెచ్‌డీ చేసిన వారికి రూ.67,000

5. డ్రోన్ పైల‌ట్ కమ్ ట్రైనర్స్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) - రూ.25,000

6. ప్రోగ్రామ్ ఇంజ‌నీర్ కమ్ ఆర్‌పీటీవో అడ్మిన్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) -రూ.25,000

7. ఐఓటీ, ఏఐ & ఎంఎల్ & 3డీ ఇంజ‌నీర్ కమ్ డ్రోన్ ట్రైన‌ర్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) -రూ.25,000

8. రీసెర్చ్ అసోసియేట్ (అన‌కాప‌ల్లి)- మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.61,000, పీహెచ్‌డీ చేసిన వారికి రూ.67,000

9. రీసెర్చ్ అసోసియేట్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) - మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.61,000, పీహెచ్‌డీ చేసిన వారికి రూ.67,000

10. రీసెర్చ్ అసోసియేట్ (తిరుప‌తి)- మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.58,000, పీహెచ్‌డీ చేసిన వారికి రూ.67,000

ఇంట‌ర్వ్యూలు జ‌రిగే తేదీలు

1. ఫిజిక‌ల్ డైరెక్టర్ (మ‌హానంది)- ఫిబ్రవ‌రి 19న ఉద‌యం 11 గంట‌ల‌కు

2. టీచింగ్ అసోసియేట్‌ (నైరా)- ఫిబ్రవ‌రి 19న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు

3. టీచింగ్ అసిస్టెంట్ (నైరా)- ఫిబ్రవ‌రి 17న ఉద‌యం 11 గంట‌ల‌కు

4. టీచింగ్ అసిస్టెంట్ (బాప‌ట్ల)- ఫిబ్రవ‌రి 21న ఉద‌యం 10 గంట‌ల‌కు

5. డ్రోన్ పైల‌ట్ కం ట్రైనర్స్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) - ఫిబ్రవ‌రి 14న సాయంత్రం 5 గంట‌ల‌కు

6. ప్రోగ్రామ్ ఇంజ‌నీర్ కమ్ ఆర్‌పీటీవో అడ్మిన్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) -ఫిబ్రవ‌రి 14న సాయంత్రం 5 గంట‌ల‌కు

7. ఐఓటీ, ఏఐ & ఎంఎల్ & 3డీ ఇంజ‌నీర్ కం డ్రోన్ ట్రైన‌ర్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) -ఫిబ్రవ‌రి 14న సాయంత్రం 5 గంట‌ల‌కు

8. రీసెర్చ్ అసోసియేట్ (అన‌కాప‌ల్లి)- ఒక పోస్టుకు ఫిబ్రవ‌రి 20న ఉద‌యం 10 గంట‌ల‌కు, రెండో పోస్టుకు ఫిబ్రవ‌రి 25న ఉద‌యం 11 గంట‌ల‌కు

9. రీసెర్చ్ అసోసియేట్ (రీజన‌ల్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్‌, లాం, గుంటూరు) -ఫిబ్రవ‌రి 20న ఉద‌యం 10 గంట‌ల‌కు

10. రీసెర్చ్ అసోసియేట్ (తిరుప‌తి)-ఫిబ్రవ‌రి 27న ఉద‌యం 11 గంట‌ల‌కు ఇంట‌ర్వ్యూలు జ‌రుగుతాయి.

పూర్తి వివ‌రాల కోసం సంప్రదించండి

పూర్తి వివ‌రాలు (ఇంట‌ర్వ్యూలు జ‌రిగే ప్రాంతం, అలాగే అర్హత‌లు త‌దిత‌ర అంశాలు) కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx ను క్లిక్ చేసి చూడొచ్చు. ఈ లింక్ క్లిక్ చేసిన త‌రువాత ఏ పోస్టుకు ఆ పోస్టుకు సంబంధించి వేర్వేరుగా నోటిఫికేష‌న్‌లు వెల్లడ‌వుతాయి. అందులో ఒక్కో నోటిఫికేష‌న్‌ను క్లిక్ చేస్తే, ఆ పోస్టుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్లడ‌వుతాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

Whats_app_banner

సంబంధిత కథనం