ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు మరో అలర్ట్ - ఇవాళ కొత్త హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్-new hall tickets released for ap dsc exams to be held on july 1st and 2 will be released today ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు మరో అలర్ట్ - ఇవాళ కొత్త హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు మరో అలర్ట్ - ఇవాళ కొత్త హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్

ఏపీ డీఎస్సీ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. జూలై 1, 2 తేదీల్లో జరగబోయే డీఎస్సీ పరీక్షల కొత్త హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.

ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు 2025

ఏపీ డీఎస్సీ - 2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ముగియగా….మరికొన్ని జరగాల్సి ఉంది. అయితే జూన్ 20, 21వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో… విద్యాశాఖ అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.

ఇవాళ హాల్ టికెట్లు విడుదల…

జూలై 1, 2 తేదీల్లో జరగబోయే డీఎస్సీ పరీక్షల కొత్త హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారులు ఇవాళ విడుదల చేయనున్నారు. https://apdsc.apcfss.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి కృష్ణారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

అభ్యర్థులు తమ కొత్త హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకొని…. ఒకటికి రెండు సార్లు పరీక్షా కేంద్రాలు సరిచూసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలను ఖచ్చితంగా నిర్ధారించుకొని… పరీక్షకు హాజరు కావాలని కోరారు.

ఇక మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మూడు సెషన్లలో ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ జరిగింది. ఇందుకు 59,889 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా…. 49,593 (82.81%) మంది హాజరయ్యారని డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి తెలియజేశారు.

ఏపీ డీఎస్సీ పరీక్షలన్నీ జూన్ 30వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షల కీలు ఉన్నాయి. TGT-నాన్ లాంగ్వేజ్, స్పెషల్ ఎడ్యుకేషన్, PGT, స్కూల్ అసిస్టెంట్ గణితం అన్ని మాధ్యమాల కీ, రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీలు, రెస్పాన్స్ షీట్లు వెబ్ సైట్ ద్వారా సులభంగా పొందవచ్చు. ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో Consolidated KEY ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ సబ్జెక్టుల వారీగా పేర్లు కనిపిస్తాయి. సబ్జెక్ట్ పక్కన డాక్యుమెంట్ అని ఉంటుంది. దాని పక్కన క్లిక్ చేస్తే… మీకు ప్రాథమిక కీతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. కీలో వచ్చే మార్కులను బట్టి… అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.