Kendriya Vidyalaya Jobs : నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం ఇంటర్వ్యూలతోనే పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టులను పార్ట్‌టైం, కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
ప్రైమరీ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) ఇంగ్లీష్, హిందీ, మాథ్యమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ పోస్టులు, ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఇంగ్లీష్, హిందీ, మాథ్యమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, సంస్కృతం పోస్టులు, యోగా ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, నర్సు, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్, తెలుగు లాంగ్వేజ్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
సీటెట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆయా విభాగాల్లో స్పెషల్ సబ్జిక్స్ కూడా పూర్తి చేయాలి. అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ మీడియంలోనే బోధన నిర్వహించాలి. ఎటువంటి ఫీజు లేదు.
1. సంబంధిత విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికేట్లు
2. ఒక సెట్ జిరాక్స్ కాపీలు
3. కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫోటో
4. ప్రైమరీ టీచర్, పీజీటీ, టీజీటీ అభ్యర్థులు సీటెట్ సర్టిఫికేట్ తప్పనిసరి.
ఉదయం పూట ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం పూట ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటలకు రిపోర్టు చేయాలి.
1. ప్రైమరీ టీచర్ పోస్టులకు ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
2. పీజీటీ, టీజీటీ పోస్టులకు ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
3. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
4. యోగా ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
5. నర్సు, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్, తెలుగు లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు ఫిబ్రవరి 19న మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
KENDRIYA VIDYALAYA, NEAR RAJIV SWAGRUHA APARTMENTS, KOTHUR, PODALAKUR ROAD, AK NAGAR P.O, NELLORE-524004. Ph:0861-2947767, Website: https://kothuru.kvs.ac.in E-mail:princykvnellore@gmail.com
ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s39c82c7143c102b71c593d98d96093fde/uploads/2025/02/2025020473.pdf లో చూడొచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం