New Medical seats : దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలలు, అదనపు ఎంబీబీఎస్​ సీట్లు- ఆంధ్రలో కూడా..-neet ug 9075 new seats approved and new medical colleges allotted across country ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  New Medical Seats : దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలలు, అదనపు ఎంబీబీఎస్​ సీట్లు- ఆంధ్రలో కూడా..

New Medical seats : దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలలు, అదనపు ఎంబీబీఎస్​ సీట్లు- ఆంధ్రలో కూడా..

Sharath Chitturi HT Telugu

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలు, ఎంబీబీఎస్​ సీట్ల సంఖ్య పెరిగాయి. ఈ మేరకు ఎన్​ఎంసీ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో వైద్య సీట్లు పెరిగాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

కొత్త మెడికల్​ సీట్లు, కాలేజీల వివరాలు..

నీట్ యూజీ విద్యార్థులకు భారీ శుభవార్త అందించింది నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్​ఎంసీ). 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి, దేశవ్యాప్తంగా 812 వైద్య కళాశాలల్లో 9,075 కొత్త ఎంబీబీఎస్​ సీట్లను జతచేస్తూ సీట్ మ్యాట్రిక్స్‌ను సవరించింది. ఈ విస్తరణతో మొత్తం ఎంబీబీఎస్​ సీట్ల సంఖ్య.. 2024-25 విద్యా సంవత్సరంలో ఉన్న 1,17,750 నుంచి ఏకంగా 1,26,600కు పెరిగింది!

ఈ పెంపు కారణంగా, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు లాభం చేకూరనుంది. వారు కోరుకున్న కళాశాలల్లో సీటు దక్కే అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఎన్​ఎంసీ అధికారిక వెబ్‌సైట్ (nmc.org.in)లో ఈ సవరించిన సీట్ మ్యాట్రిక్స్ అందుబాటులో ఉంది.

కొత్త మెడికల్ కాలేజీలు, సీట్ల వివరాలు రాష్ట్రాల వారీగా...

కొత్తగా మంజూరైన సీట్లు, కళాశాలల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

ఉత్తరప్రదేశ్, పశ్చిమ్​ బెంగాల్-

పశ్చిమ్​ బెంగాల్‌లో రెండు కొత్త వైద్య కళాశాలలకు ఆమోదం లభించింది. అవి: రాణిగంజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (100 సీట్లు), పీకేజీ మెడికల్ సైన్స్ (50 సీట్లు). ఉత్తరప్రదేశ్‌లో, అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీ (ప్రభుత్వ) 2025-26 విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో త్వరలోనే ప్రారంభం కానుంది.

తమిళనాడు, రాజస్థాన్-

తమిళనాడులోని విల్లుపురంకు చెందిన ప్రైవేట్ కళాశాల అయిన తక్షశిల మెడికల్ కాలేజీ 50 సీట్లను జతచేయనుంది. ఇక రాజస్థాన్‌లో, ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ప్రభుత్వ కేటగిరీ), ఆర్య మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ప్రైవేట్ కేటగిరీ) రెండూ చెరో 50 సీట్లను పెంచాయి.

మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్-

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 50 సీట్లను పెంచింది. ఝార్ఖండ్‌లోని సరైకెలాలో ఉన్న నేతాజీ సుభాస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 100 సీట్లను, అలాగే జమ్ముకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ 50 సీట్లను పెంచుకున్నాయి.

హరియాణా, బిహార్-

హరియాణాలో పీటీ. నేకీ రామ్ శర్మ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (భివానీ), మహర్షి చ్యవన్ మెడికల్ కాలేజ్ (కోరియావాస్) రెండూ చెరో 100 సీట్లను జతచేశాయి. అదేవిధంగా, బిహార్‌లోని మహాబోధి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మరియు శ్యామలాల్ చంద్రశేఖర్ మెడికల్ కాలేజ్ అండ్ ఎస్​పీఎన్​ఎం హాస్పిటల్ సైతం చెరో 100 సీట్లను పెంచాయి.

ఆంధ్రప్రదేశ్-

ఆంధ్రప్రదేశ్‌లో, ప్రైవేట్ సంస్థ అయిన అన్న గౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 150 సీట్లను పెంచుకుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం