NEET UG 2025 syllabus : నీట్​ యూజీ అభ్యర్థులకు కీలక అలర్ట్​! సిలబస్​ విడుదల- కచ్చితంగా చెక్​ చేయండి..-neet ug 2025 syllabus official website announced see full details inside ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Neet Ug 2025 Syllabus : నీట్​ యూజీ అభ్యర్థులకు కీలక అలర్ట్​! సిలబస్​ విడుదల- కచ్చితంగా చెక్​ చేయండి..

NEET UG 2025 syllabus : నీట్​ యూజీ అభ్యర్థులకు కీలక అలర్ట్​! సిలబస్​ విడుదల- కచ్చితంగా చెక్​ చేయండి..

hindustantimes.com HT Telugu
Dec 31, 2024 11:15 AM IST

NEET UG 2025 : నీట్​ యూజీ 2025 అభ్యర్థులకు అలర్ట్​! నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ యూజీ 2025 కోసం అధికారిక సిలబస్‌ను ప్రకటించింది. దీనిలో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ వంటి టాపిక్స్​ కవర్​ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

నీట్ యూజీ 2025 సిలబస్ విడుదల..
నీట్ యూజీ 2025 సిలబస్ విడుదల..

నీట్​ యూజీ 2025 అభ్యర్థులకు అలర్ట్​! అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్​కి సంబంధించిన సిలబస్, అధికారిక వెబ్​సైట్​ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా ప్రకటించింది.

yearly horoscope entry point

నీట్​ యూజీ 2025 వెబ్​సైట్​​..

నీట్ యూజీ 2025 కోసం అధికారిక వెబ్​సైట్ neet.nta.nic.in అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ వెబ్​సైట్​లోనే ఎన్టీఏ ఆన్​లైన రిజిస్ట్రేషన్-కమ్-అప్లికేషన్ ప్రక్రియను నిర్వహిస్తుంది. కీలక సమాచార బులెటిన్, పరీక్షకు సంబంధించిన సిటీ స్లిప్స్​, అడ్మిట్ కార్డులు, తాత్కాలిక- తుది సమాధాన కీలు, ఫలితాలతో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను ఇందులోనే పంచుకుంటుంది.

నీట్ యూజీ 2025 సిలబస్..

ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలకు నీట్ యూజీ 2025 సిలబస్​ని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) ఖరారు చేసింది.

బయాలజీలో 10 యూనిట్ల నుంచి అంశాలు ఉన్నాయి:

  • డైవర్సిటీ ఇన్​ లివింగ్​ వరల్డ్​
  • స్ట్రక్చరల్​ ఆర్గనైజేషన్​ ఇన్​ యానిమిల్స్​ అండ్​ ప్లాంట్స్​
  • సెల్​ స్ట్రక్చర్​ అండ్​ ఫంక్షన్​
  • ప్లాంట్​ ఫిజియాలాజీ
  • హ్యూమన్​ ఫిజియాలాజీ
  • రిప్రొడక్షన్​
  • జెనెటిక్స్​ అండ్​ ఎవల్యూషన్​
  • బయోలాజీ- హ్యూమన్​ వెల్​ఫేర్​,
  • బయోటెక్నాలజీ అండ్​ ఇట్స్​ అప్లికేషన్స్​,
  • ఎకాలజీ అండ్​ ఎన్విరాన్మెంట్​

ఫిజిక్స్ సిలబస్ 20 యూనిట్ల నుంచి ఈ అంశాలు ఉన్నాయి.

  • ఫిజిక్స్​ అండ్​ మెజర్మెంట్స్​
  • కైనమాటిక్స్​
  • లాస్​ ఆప్​ మోషన్​
  • వర్క్- ఎనర్జీ- పవర్​
  • రొటేషనల్​ మోషన్​
  • గ్రావిటేషన్​
  • ప్రాపర్టీస్​ ఆఫ్​ సాలిడ్స్​ అండ్​ లిక్విడ్స్​
  • థర్మోడైనమిక్స్​
  • కైనటిక్​ థియరీ ఆఫ్​ గ్యాసెస్​
  • ఆసిలేషన్స్​ అండ్​ వేవ్స్​
  • ఎలక్ట్రోస్టాటిక్స్​
  • కరెంట్​ ఎలక్ట్రిసిటీ
  • మాగ్నెటిక్​ ఎఫెక్ట్స్​ ఆఫ్​ కరెంట్​ అండ్​ మగ్నెటిజం
  • ఎలక్ట్రోమాగ్నెటిక్​ ఇండక్షన్​ అండ్​ ఆల్టర్నేటివ్​ కరెంట్స్​
  • ఎలక్ట్రోమాగ్నెటిక్​ వేవ్స్​
  • ఆప్టిక్స్​
  • డ్యూయెల్​ నేచర్​ ఆఫ్​ మాటర్​ అండ్​ రేడియేషన్​
  • ఆటమ్స్​ అండ్​ న్యూక్లియై
  • ఎలక్ట్రానిక్​ డివైజెస్​
  • ఎక్స్​పరిమెంటల్​ స్కిల్స్​

కెమిస్ట్రీ సిలబస్ 20 యూనిట్ల నుంచి ఈ అంశాలు ఉన్నాయి :

  • బేసిక్స్​ కాన్సెప్ట్స్​ ఇన్​ కెమిస్ట్రీ
  • అటామిక్​ స్ట్రక్చర్
  • కెమికల్​ బాండిండ్​ అండ్​ మాలిక్యులర్​ స్ట్రక్చర్​
  • కెమికల్​ థర్మోడైనమిక్స్​
  • సొల్యూషన్స్​
  • ఈక్విలిబ్రియం,
  • రెడాక్స్​ రియాక్షన్స్​ అండ్​ ఎలక్ట్రోకెమిస్ట్రీ
  • కెమికల్​ కైనెటిక్స్​
  • క్లాసిఫికేషన్​ ఆఫ్​ ఎలిమెంట్స్​ అండ్​ పిరియాడిసిటీ ఇన్​ ప్రాపర్టీస్​
  • పీ బ్లాక్​ ఎలిమెంట్స్​- డీ, ఎఫ్​ బ్లాక్​ ఎలిమెంట్స్​
  • కో ఆర్డినేషన్​ కాంపౌండ్స్​,
  • ప్యూరిఫికేషన్​ అండ్​ క్యారెక్టరైజేషన్​ ఆఫ్​ ఆర్గానిక్​ కాంపౌండ్​
  • బేసిక్​ ప్రిన్సిపల్స్​ ఆఫ్​ ఆర్గానిక్​ కెమిస్ట్రీ
  • హైడ్రోకార్బన్స్​
  • ఆర్గానిక్​ కాంపౌండ్స్​ కంటైనింగ్​ హాలోజెన్స్​, ఆక్సీజన్​, నైట్రోజెన్​
  • బయోమాలిక్యూల్స్​
  • ప్రాక్టికల్​ కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్

నీట్ యూజీ 2025 సిలబస్​కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

నీట్ యూజీ అనేది భారతదేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయి పరీక్ష. యూజీ స్థాయిలో డెంటిస్ట్రీ, ఆయుర్వేద, వెటర్నరీ, నర్సింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం