NEET 2025 registration : నీట్ యూజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు- ఇవి తెలుసుకుని అప్లై చేయాలి..
NEET UG 2025 : నీట్ యూజీ 2025పై కీలక్ అప్డేట్. నీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. చివరి తేదీ ఏంటి? రిజిస్ట్రేషన్ గైడ్‌లైన్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నీట్ యూజీ 2025 (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్) పరీక్షకు సంబంధించిన కీలక అప్డేట్! నీట్ యూజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రారంభించింది. విద్యార్థులు నీట్ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్..
నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ మార్చ్ 7 రాత్రి 11 గంటల 50 నిమిషాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఫీజు చెల్లింపుకు కూడా ఇదే చివరి గడువు.
భారతదేశంలోని పరీక్ష కేంద్రంలో పరీక్షకు హాజరయ్యే సాధారణ అభ్యర్థులకు రూ. 1,700, జనరల్-ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ. 1,600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్‌జెండర్ అభ్యర్థులకు రూ. 1,000 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. భారతదేశం వెలుపల పరీక్షకు హాజరయ్యే వారికి నీట్ యూజీ 2025 అప్లికేషన్ ఫీజు రూ. 9500!
అప్లికేషన్ విండో మూసివేసిన తర్వాత, ఎన్టీఏ మార్చ్ 9 నుంచి 11 వరకు అభ్యర్థులకు కరెక్షన్ విండోను ఓపెన్‌లో ఉంచుతుంది.
నీట్ సిటీ స్లిప్‌లు ఏప్రిల్ 26 నాటికి విడుదల అవుతాయని తెలుస్తోంది. నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు మే 1 నాటికి విడుదల అవుతాయని సమాచారం.
ఈ ఏడాది, మెడికల్ ప్రవేశ పరీక్ష మే 4న, ఒకే షిఫ్ట్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. నీట్ యూజీ ఫలితాలు జూన్ 14న వెలువడే అవకాశం ఉంది.
నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ యూజీ 2025- అభ్యర్థులకు సూచనలు
- నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెబ్‌సైట్ ncbc.nic.inలో అందుబాటులో ఉన్న సెంట్రల్ లిస్ట్ ఆఫ్ అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ప్రకారం OBC-NCL విభాగంలోకి వచ్చే అభ్యర్థులు కేటగిరి కాలమ్‌లో OBC-NCLని పేర్కొనవచ్చు. OBC-NCL (సెంట్రల్ లిస్ట్)లో లేని రాష్ట్ర జాబితాలోని OBC-NCL అభ్యర్థులు జనరల్‌ను ఎంచుకోవాలి.
- అభ్యర్థులు neet.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే “ఆన్‌లైన్” మోడ్ ద్వారా నీట్ యూజీ 2025 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ ఇతర విధానంలోనూ దరఖాస్తులు చేయకూడదు.
- అభ్యర్థులు ఇటీవలి పాస్‌పోర్ట్ ఫోటో, చిరునామా రుజువు, స్కాన్ చేసిన సంతకం మొదలైన వాటిని అప్‌లోడ్ చేయాలి. వివరణాత్మక సమాచారం కోసం, వారు సమాచార బులెటిన్‌ను తనిఖీ చేయవచ్చు.
- ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించవచ్చు. ఎన్టీఏ వెబ్‌సైట్, సమాచార బులెటిన్‌లో ఇచ్చిన సూచనలను అభ్యర్థులు కచ్చితంగా పాటించాలి. సూచనలను పాటించని అభ్యర్థులు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది.
- అప్లికేషన్ ఫారమ్‌లో ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ వారి సొంత లేదా తల్లిదండ్రులు/ సంరక్షకులవి మాత్రమే అని అభ్యర్థులు నిర్ధారించుకోవాలి. ఎందుకంటే అన్ని సమాచారం/సంభాషణలు ఎన్టీఏ ద్వారా సదరు ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పంపడం జరుగుతుంది.
నీట్ 2025కి సంబంధించిన మరింత స్పష్టత కోసం, అభ్యర్థులు వ్యక్తిగతంగా లేదా 011-40759000/011-69227700 లేదా neetug2025@nta.ac.inకు ఈమెయిల్ ద్వారా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం