తెలుగు న్యూస్ / career /
NEET UG 2025: నీట్ యూజీ 2025 పై ఎన్టీఏ కీలక అప్ డేట్; ఇకపై ప్రశ్నాపత్రం ఇలా ఉంటుంది..!
NEET UG 2025: దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ యూజీ లో 2025 సంవత్సరం నుంచి కీలక మార్పులు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. నీట్ యూజీ 2025 లో ఎన్టీఏ చేపట్టిన మార్పులను ఇక్కడ చూడండి..
నీట్ యూజీ 2025 పై ఎన్టీఏ కీలక అప్ డేట్
NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్ష ప్రశ్నాపత్రం సరళి, పరీక్ష వ్యవధిపై స్పష్టతకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ 2025 ప్రశ్నాపత్రం సరళి, పరీక్ష వ్యవధిని ప్రీ కోవిడ్ ఫార్మాట్ కు మారుస్తామని ఎన్టీఏ అభ్యర్థులకు తెలియజేసింది. ప్రీ కోవిడ్ ఫార్మాట్ ప్రకారం ఇకపై సెక్షన్ బి ఉండదు.
ప్రశ్నాపత్రం సరళి ఇలా.
- మొత్తం 180 తప్పనిసరి ప్రశ్నలు ఉంటాయి.
- ఫిజిక్స్, కెమిస్ట్రీలో 45 చొప్పున ప్రశ్నలు
- బయాలజీ నుంచి 90 ప్రశ్నలు అడుగుతారు
- కొవిడ్-19 మహమ్మారి సమయంలో తాత్కాలికంగా ప్రవేశపెట్టిన ఆప్షనల్ ప్రశ్నల నిబంధన ఇకపై అందుబాటులో ఉండదు.
- పరీక్ష మొత్తం వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు)
నీట్ (NEET) యూజీ 2025 రిజిస్ట్రేషన్లకు ఏపీఏఆర్ ఐడీ తప్పనిసరి కాదని, నీట్ (యూజీ)-2025ను పెన్ అండ్ పేపర్ మోడ్ (ఓఎంఆర్ ఆధారిత)లో సింగిల్ డే, సింగిల్ షిఫ్టులో నిర్వహిస్తామని ఎన్టీఏ ఇప్పటికే అభ్యర్థులకు తెలిపింది.