మరో రెండు రోజుల్లో నీట్ యూజీ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది. అధికారిక అప్డేట్ ప్రకారం, నీట్ యూజీ 2025 ఫలితాలను జూన్ 14, 2025 నాటికి ప్రకటిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (neet) కు హాజరైన అభ్యర్థులు ఎన్ టీఏ నీట్ అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in లో ఫలితాలను చూసుకోవచ్చు.
నీట్ ఫలితాలు 2025 ప్రకటనకు ముందు, భారతదేశంలోని ఉత్తమ వైద్య కళాశాలల గురించి ఒక అవగాహన కలిగి ఉండడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవసరం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం భారత్ లోని టాప్ మెడికల్ కాలేజీల జాబితాను విడుదల చేశారు. అవి
ర్యాంక్ 1: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ
ర్యాంక్ 2: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్), చండీగఢ్
ర్యాంక్ 3: క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు
ర్యాంక్ 4: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, (నిమ్హాన్స్) బెంగళూరు
ర్యాంక్ 5: జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్), పుదుచ్చేరి
ర్యాంక్ 6: సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీఐఎంఎస్), లక్నో
ర్యాంక్ 7: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్ యు), వారణాసి
ర్యాంక్ 8: అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు
ర్యాంక్ 9: కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్
ర్యాంక్ 10: మద్రాస్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై
ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో పేర్కొన్న అర్హత ప్రమాణాలు మరియు ఇతర నిబంధనల ప్రకారం మెరిట్ లిస్ట్ / ఆలిండియా ర్యాంక్ (ఎఐఆర్) ను ఎన్టీఏ తయారు చేస్తుంది. నీట్ యూజీ - 2025లో సాధించిన మార్కుల ఆధారంగా అఖిల భారత కోటా సీట్లలో 15% ఎంచుకున్న అర్హులైన, విజయవంతమైన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఎన్టీఏ తయారు చేస్తుంది. 15% ఆలిండియా కోటా సీట్లకు ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు కోసం ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (మెడికల్ ఎగ్జామినేషన్ సెల్), నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం), నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి (ఎన్సీహెచ్) లకు పంపుతారు.
సంబంధిత కథనం