నీట్ యూజీ 2025 లో టాపర్స్ వీరే.. మహేశ్ కు ఫస్ట్ ర్యాంక్; ఫిమేల్ టాపర్ అవిక-neet result 2025 toppers mahesh secures air 1 avika is female topper ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  నీట్ యూజీ 2025 లో టాపర్స్ వీరే.. మహేశ్ కు ఫస్ట్ ర్యాంక్; ఫిమేల్ టాపర్ అవిక

నీట్ యూజీ 2025 లో టాపర్స్ వీరే.. మహేశ్ కు ఫస్ట్ ర్యాంక్; ఫిమేల్ టాపర్ అవిక

Sudarshan V HT Telugu

నీట్ ఫలితాలు 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలతో పాటు టాపర్ల జాబితాను కూడా విడుదల చేశారు. మహేష్ కుమార్ 1వ ర్యాంక్ సాధించాడు. అవికా అగర్వాల్ ఆల్ ఇండియా ర్యాంక్ 5 సాధించి ఫిమేల్ టాపర్ గా నిలిచింది.

నీట్ యూజీ 2025 లో టాపర్స్ (HT File)

నీట్ యూజీ 2025 ఫలితాలను జూన్ 14, 2025 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు మెరిట్ జాబితాను కూడా ఏజెన్సీ విడుదల చేసింది.

టాపర్ పర్సంటైల్ 99.9999547

నీట్ యూజీ 2025లో రాజస్థాన్ కు చెందిన మహేష్ కుమార్ ఏఐఆర్ 1 సాధించాడు. అతడు 99.9999547 పర్సంటైల్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ మహిళల్లో టాపర్ గా నిలిచింది. ఆమె నీట్ యూజీ 2025లో ఏఐఆర్ 5 సాధించి 99.9996832 పర్సంటైల్ సాధించింది.

టాప్ 10 ర్యాంక్స్ సాధించిన వారి జాబితా

నీట్ యూజీ 2025 లో తొలి 10 ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఈ కింద చూడండి.

ర్యాంక్ 1: మహేష్ కుమార్ - 99.9999547 పర్సంటైల్

ర్యాంక్ 2: ఉత్కర్ష్ అవధియా - 99.9999095 పర్సంటైల్

ర్యాంక్ 3: క్రిషంగ్ జోషి- 99.9998189 పర్సంటైల్

ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్

ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్

ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్

ర్యాంక్ 5: అవికా అగర్వాల్- 99.9996832 పర్సంటైల్

ర్యాంక్ 6: జెనిల్ వినోద్‌భాయ్ భాయాని- 99.9996832 పర్సంటైల్

ర్యాంక్ 7: కేశవ్ మిత్తల్- 99.9996832 పర్సంటైల్

ర్యాంక్ 8: ఝా భవ్య చిరాగ్- 99.9996379 పర్సంటైల్

ర్యాంక్ 9: హర్ష్ కేదావత్- 99.9995474 పర్సంటైల్

ర్యాంక్ 10: ఆరవ్ అగర్వాల్- 99.9995474 పర్సంటైల్

సుమారు 22 లక్షల మంది..

నీట్ యూజీ 2025 పరీక్షకు 22,76,069 మంది రిజిస్టర్ చేసుకోగా, 22,09,318 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 12,36,531 మంది అభ్యర్థులు మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం అభ్యర్థుల్లో 5,14,063 మంది పురుషులు, 7,22,462 మంది మహిళా అభ్యర్థులు, ఆరుగురు థర్డ్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు.

నీట్ యూజీ 2025 ఫలితాలు చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం