ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్ పీజీ 2025 పరీక్ష-neet pg 2025 examination to be held on august 3 after sc gives nod to nbems ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్ పీజీ 2025 పరీక్ష

ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్ పీజీ 2025 పరీక్ష

Sudarshan V HT Telugu

నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్ 3వ తేదీన జరగనుంది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుప్రీంకోర్టుకు తెలపింది. నీట్ పీజీ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో, నీట్ పీజీ 2025ని ఆగస్ట్ 3వ తేదీన నిర్వహిస్తామని ఎన్బీఈ వెల్లడించింది.

ఆగస్టు 3న నీట్ పీజీ 2025 పరీక్ష

నీట్-పీజీ 2025 పరీక్షను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్ లో నిర్వహించడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS)కు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది. నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్బీఈఎంఎస్ ని ఆదేశించిన విషయం తెలిసిందే.

రెండు నెలల సమయం

నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు పైగా సమయం కావాలని ఎన్బీఈఎంఎస్ సుప్రీంకోర్టును కోరింది. ఈ అభ్యర్థనను మొదట ప్రశ్నించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం, ఆ తరువాత ఎన్బీఈఎంఎస్ అభ్యర్థనను అంగీకరించింది. ఆగస్టు 3న నీట్-పీజీ 2025 నిర్వహించడానికి ఎన్బీఈఎంఎస్ పేర్కొన్న కారణాలు సరైనవిగా కనిపిస్తున్నాయని పేర్కొంది.

మరింత సమయం ఇవ్వలేం

అయితే నీట్-పీజీ 2025 పరీక్ష నిర్వహణకు ఎన్బీఈఎంఎస్ కు మరింత సమయం ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మే 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాల్సి ఉందని, అందువల్ల ఒకేసారి పరీక్ష నిర్వహించడానికి సుమారు 1,000 పరీక్షా కేంద్రాలు అవసరమని ఎన్బీఈఎంఎస్ వాదించింది. జూన్ 15న జరగాల్సిన పరీక్షను తమ టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) సహకారంతో ఆగస్టు 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ఒకే షిఫ్ట్ లో నిర్వహిస్తామని ఎన్బీఈఎంఎస్ పిటిషన్లో పేర్కొంది.

రెండు షిఫ్ట్ ల్లో వద్దు

అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న తేదీ అయిన నీట్ పీజీ 2025ను ఆగస్టు 3 న షెడ్యూల్ చేయడానికి ఎన్బీఈఎంఎస్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలన్న ఎన్బీఈఎంఎస్ నిర్ణయాన్ని మే 30న సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జూన్ 15న జరగాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని ఆదేశించింది. ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలంటే సమయం సరిపోదని, జూన్ 15న కాకుండా, ఆగస్ట్ 3వ తేదీన నీట్-పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని సుప్రీంకోర్టు కు తెలిపింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం