నీట్ పీజీ 2025పై బిగ్ అప్డేట్! పరీక్ష నిర్వహణ తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీని 2025 జూన్ 15న నిర్వహించనున్నట్లు బోర్డు తన వెబ్సైట్ natboard.edu.in లో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఈ నీట్ పీజీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.
“నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నీట్-పీజీ 2025 పరీక్ష 2025 జూన్ 15న కంప్యూటర్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై రెండు షిఫ్టుల్లో జరుగుతుంది,” అని నోటిఫికేషన్లో ఉంది.
నీట్ పీజీ 2025కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ని త్వరలో అధికారిక వెబ్సైట్లో షేర్ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
నీట్ పీజీ 2025 ఎగ్జామ్ డేట్ కోసం అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నోటీసు వచ్చింది.
అధికారిక ప్రకటన చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
50శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు, రాష్ట్ర కోటా సీట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీ సీట్లు, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్, పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ అండ్ డీఆర్ఎన్బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్బీఈఎంఎస్ డిప్లొమా కోర్సుల కోసం ప్రతియేటా నీట్ పీజీ జరుగుతుంది.
2024లానే ఈసారి కూడా రెండు షిఫ్టుల్లో (ఉదయం 9-12:30, మధ్యాహ్నం 3:30-7) నీట్ పీజీ 2025ని నిర్వహించాలన్న నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు.
“రెండు షిఫ్టుల్లో పరీక్ష జరిగింది. నార్మలైజేషన్‌పై గందరగోళాన్ని చూశాము. మళ్లీ అదే తప్పు ఎందుకు చేయాలి,” అని ఒకరు ట్వీట్ చేశారు.
“ఒకే దేశం- ఒకే ఎన్నికను నిర్వహిస్తారు. కానీ ఒకే షిఫ్ట్‌లో పరీక్షలను నిర్వహించలేరు,” అని మరొక ఎక్స్ యూజర్ ట్వీట్ చేశారు.
“నీట్ పీజీలో పాటించే నార్మలైజేషన్ కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. పరీక్ష పారదర్శనకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నయి,” అని మరొకరు పేర్కొన్నారు.
సంబంధిత కథనం