తెలుగు న్యూస్ / career /
NEET PG 2024 Counselling: నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ లో వివిధ కేటగిరీల కటాఫ్ పర్సంటైల్ తగ్గింపు
NEET PG 2024 Counselling: నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ లో కటాఫ్ పర్సంటైల్ కు సంబంధించి కీలక అప్ డేట్ వెలువడింది. వివిధ కేటగిరీలకు కటాఫ్ పర్సంటైల్ ను తగ్గిస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. పూర్తి వివరాలను ఈ కథనంలో చదవండి.
నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ (Getty Images/iStockphoto)
NEET PG 2024 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 కటాఫ్ పర్సంటైల్ ను తగ్గిస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నిర్ణయం తీసుకుంది. ఎన్ఎంసీతో సంప్రదించి ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యూ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 పర్సంటైల్ ను తగ్గించినట్లు అభ్యర్థులకు సమాచారం ఇస్తున్నామని ఎంసీసీ అధికారిక నోటీసులో పేర్కొంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం, అర్హత ప్రమాణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఇవే అర్హత ప్రమాణాలు
- జనరల్ కేటగిరీ / ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు, 15 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ లో పాల్గొనడానికి అర్హులు.
- ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగులు 10 పర్సంటైల్, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు అర్హులు.
- నీట్ పీజీ 2024 రౌండ్ 3 సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ 2025 జనవరి 4న విడుదల చేయనుంది. రౌండ్ 3 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు mcc.nic.in ఎంసీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
- మరింత సమాచారం కోసం, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.