నీట్​ యూజీ 2025 అడ్మిట్​ కార్డులు ఎప్పుడు వస్తాయి? ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి?-neet 2025 admit card when will nta release hall tickets what we know so far ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  నీట్​ యూజీ 2025 అడ్మిట్​ కార్డులు ఎప్పుడు వస్తాయి? ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి?

నీట్​ యూజీ 2025 అడ్మిట్​ కార్డులు ఎప్పుడు వస్తాయి? ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి?

Sharath Chitturi HT Telugu

నీట్​ యూజీ 2025 పరీక్ష తేదీ సమీపిస్తోంది. మరి అడ్మిట్​ కార్డులు ఎప్పుడు విడుదల అవుతాయి? ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి? ఈ విషయాలపై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..

నీట్​ యూజీ 2025 వివరాలు.. (Unsplash)

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్/ నీట్ యూజీ 2025ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మే 4న నిర్వహించనుంది. ఈ పరీక్షకు సిటీ ఇంటిమేషన్​ స్లిప్స్​ని ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేయగా, neet.nta.nic.in లో అడ్మిట్ కార్డులను జారీ చేయనుంది.

పరీక్ష సమాచార బులెటిన్ ప్రకారం, నీట్​ యూజీ 2025 అడ్మిట్ కార్డులను మే 1, 2025 నాటికి neet.nta.nic.in విడుదల చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ షిఫ్టులో ఆఫ్​లైన్​లో ఈ నీట్​ 2025 పరీక్ష జరుగుతుంది.

ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ నోటిఫికేషన్​లో అడ్మిట్ కార్డులకు భిన్నంగా డాక్యుమెంట్ ఉందని సంస్థ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేయడానికి మాత్రమే సిటీ స్లిప్స్​ పనికొస్తాయని స్పష్టం చేసింది..

నీట్​ యూజీ 2025 పరీక్ష కేంద్రం చిరునామా, రోల్ నంబర్లు, ఇతర ముఖ్యమైన వివరాలు అడ్మిట్ కార్డులో లభిస్తాయి. అడ్మిట్ కార్డులో ముఖ్యమైన పరీక్ష రోజు సూచనలు కూడా ఉంటాయి.

పరీక్ష రోజున అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీ, చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు, వారి ఫొటోలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డులో ఫొటో స్పెసిఫికేషన్లు, ఆమోదయోగ్యమైన గుర్తింపు కార్డుల జాబితా ఉంటుంది.

నీట్ 2025 అడ్మిట్ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోవాలి..

స్టెప్​ 1- అధికారిక వెబ్​సైట్​కి వెళ్లాలి (neet.nta.nic.in.)

స్టెప్​ 2- నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డ్ ట్యాబ్ ఓపెన్ చేయండి.

స్టెప్​ 3- మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.

స్టెప్​ 4- అడ్మిట్ కార్డును సబ్మిట్ చేసి డౌన్​లోడ్​ చేసుకోవాలి.

నీట్ యూజీకి సంబంధించి ఏదైనా సహాయం కోసం అభ్యర్థులు ఎన్టీఏ హెల్ప్​డెస్క్ 011-40759000, 011-69227700 లేదా neetug2025@nta.ac.in వద్ద ఈ-మెయిల్​ ద్వారా సంప్రదించవచ్చు.

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఈ నీట్ యూజీ.

ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షను రాస్తున్నారని, పాల్గొనే వారి సంఖ్య పరంగా ఇది దేశంలోనే అతిపెద్ద పరీక్షల్లో ఒకటి అని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ని సందర్శించవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం