NCL Apprentice: నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విండో ఈ రోజు రాత్రితో క్లోజ్ అవుతుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు ఈ రోజు అర్ధరాత్రి వరకు ఎన్సీఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
ఎన్సీఎల్ లో అప్రెంటిస్ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు కటాఫ్ తేదీ నాటికి అంటే 01/03/2025 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థి/దరఖాస్తుదారుడు 02/03/1999 నుంచి 02/03/2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా ఎన్ సీఎల్ సంస్థలో 1765 పోస్టులను భర్తీ చేయనుంది.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:
1. గ్రాడ్యుయేట్లు: 152 పోస్టులు
2. డిప్లొమా: 597 పోస్టులు
3. ట్రేడ్ అప్రెంటీస్: 941 పోస్టులు
ఎన్ సీఎల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి.
2. రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
3. అప్రెంటిస్ అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేయండి.
4. రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ నింపాలి.
5. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
6. సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
7. భవిష్యత్ రిఫరెన్స్ కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
ఎంపికైన అభ్యర్థులు మార్చి 24వ తేదీ నుంచి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఎన్సీఎల్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.
సంబంధిత కథనం