ఏపీ మెగా డీఎస్సీకి 5 లక్షలకుపైగా దరఖాస్తులు - ఈనెల 30న హాల్ టికెట్లు విడుదల-more than 5 lakhs applications received for ap mega dsc 2025 hall tickets will be available from may 30 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ మెగా డీఎస్సీకి 5 లక్షలకుపైగా దరఖాస్తులు - ఈనెల 30న హాల్ టికెట్లు విడుదల

ఏపీ మెగా డీఎస్సీకి 5 లక్షలకుపైగా దరఖాస్తులు - ఈనెల 30న హాల్ టికెట్లు విడుదల

ఏపీ మెగా డీఎస్సీ దరఖాస్తుల గడువు ముగిసింది. అన్ని పోస్టులకు కలిపి మొత్తం 5,77,417 అప్లికేషన్లు అందాయి. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 39 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు మే 30వ తేదీన విడుదల కానున్నాయి.

ఏపీ మెగా డీఎస్సీ దరఖాస్తులు - హాల్ టికెట్ అప్డేట్స్

ఏపీ మెగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గత నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కాగా…. మే 15 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. అయితే ఈసారి ఈ మెగా డీఎస్సీకి 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా…. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లయ్ చేసుకున్నారు.

ఏపీలో డీఎస్సీ నిర్వహణ కోసం అభ్యర్థులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. 2024లో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైనా ఎన్నికల కోడ్‌ రావడంతో అది జరగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత నోటిఫికేషన్‌ రద్దు చేసింది. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. దాదాపు ఏడాది కాలంగా డీఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం లక్షలాది మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దీంతో 5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.

ఏపీ మెగా డీఎస్సీలో భాగాగం…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈ పోస్టుల కోసం అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 39,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. కడప జిల్లాలో 15,812 మంది మాత్రమే అప్లయ్ చేశారు. ఇక వేరే రాష్ట్రాలకు చెందిన వారు 7 వేలకుపైగా ఉన్నారు.

హాల్ టికెట్లు ఎప్పుడంటే…?

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం….మే 30వ తేదీ నుంచి నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో సులభంగా వీటిని పొందే అవకాశం ఉంటుంది. ఇక మే 20వ తేదీ నుంచి మాక్ టెస్టులు రాసే ఆప్షన్ వెబ్ సైట్ లో అందుబాటులోకి వస్తుంది.

ఏపీ డీఎస్సీ పరీక్షలు జూన్‌ 6 నుంచి ప్రారంభమవుతాయి. జులై 6వ తేదీ వరకు జరుగుతాయి. సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదలవుతాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం