MIT free education : ప్రపంచ ప్రఖ్యాత ‘ఎంఐటీ’లో ఉచితంగా విద్య- మీ కలల్ని సాకారం చేసుకోండి..
Free education in MIT : ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ‘ఎంఐటీ’.. విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది! తమ వద్ద ఉచితంగా విద్య చెబుతాని స్పష్టం చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఉత్తమ విశ్వవిద్యాలయాల నుంచి ఉన్నత విద్యను అభ్యసించడం చాలా మందికి ఒక కల! ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు, సరైన ఆర్థిక స్తోమత లేక ఇలాంటి కలల్ని వదులుకుంటారు. అయితే, ఇలాంటి వారి కోసం ప్రపంచ ప్రఖ్యాత విశ్వ విద్యాలయం ఎంఐటీ (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా విద్య చెప్పేందుకు ఎంఐటీ ముందుకు వచ్చింది. కానీ ఇక్కడ ఒక కండీషన్ ఉంది.
ఎంఐటీలో ఉచితంగా విద్య..
200,000 డాలర్ల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న అండర్ గ్రాడ్యుయేట్లు.. వచ్చే సంవత్సరం నుంచి ఎంఐటీలో ట్యూషన్ ఫ్రీగా పొంది, తరగతులకు హాజరు కావచ్చని విశ్వవిద్యాలయం ఇటీవలే ఒక ప్రకటన చేసింది. కొత్తగా పెంచిన ఆర్థిక సహాయం వల్లే ఇది సాధ్యమైందని విశ్వవిద్యాలయం చెబుతోంది.
ఎంఐటీ న్యూస్ ప్రకారం.. 80శాతం అమెరికన్ కుటుంబాలు ఈ ఆదాయ పరిమితిలో ఉంటాయి. 100,000 డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న 50శాతం అమెరికన్ కుటుంబాలకు, తల్లిదండ్రులు తమ బిడ్డలఎంఐటీ విద్యకు సంబంధించిన పూర్తి ఖర్చు కోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు! ట్యూషన్‌తో పాటు స్టే, భోజనం, ఫీజులు, పుస్తకాలు, వ్యక్తిగత ఖర్చులను వర్సిటీ కవర్ చేయనుంది.
"ఎంఐటీ విలక్షణమైన విద్యా నమూనా - ఇంటెన్స్, డిమాండింగ్, సైన్స్- ఇంజనీరింగ్‌లో బలమైన మూలలు.. మా విద్యార్థులు, సమాజంలో ఆచరణాత్మక విలువను కలిగి ఉంది," అని ఎంఐటి అధ్యక్షుడు సాలీ కోర్న్బ్లత్ చెప్పారు.
పలు రిపోర్టుల ప్రకారం.. అమెరికాలోని 9 విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆర్థిక స్తోమతను పరిగణలోకి తీసుకోకుండా అడ్మిషన్ ప్రాసెస్‌ని కొనసాగించే సంస్థ ఈ ఎంఐటీ. ఎంఐటీ విద్యను విద్యార్థులు, తల్లిదండ్రులకు వీలైనంత చౌకగా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వర్సిటీ తెలిపింది.
ఎంఐటి న్యూస్ విడుదల నోటీస్ ప్రకారం.. వచ్చే ఫాల్ (సెప్టెంబర్) నుంచి 100,000 డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు, సాధారణ ఆస్తులు ఉన్న కుటుంబాలకు.. ట్యూషన్, హౌసింగ్, భోజనం, ఫీజులు, పుస్తకాలు, వ్యక్తిగత ఖర్చుల కోసం భత్యాలతో సహా చదువుకు కావాల్సిన పూర్తి ఖర్చు కోసం తల్లిదండ్రులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని ఆశించవచ్చు. సాధారణ ఆస్తులు ఉన్న (100,000 నుంచి 200,000 ఆదాయం) కుటుంబాలు మాత్రం.. 0 నుంచి గరిష్టంగా 23,970 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎంఐటీలో స్టే, భోజనం, ఫీజులు, పుస్తకాలు- వ్యక్తిగత ఖర్చుల కోసం ఈ సంవత్సరం మొత్తం అయిన ఖర్చు. ఎడ్యుకేషన్ డేటా ఇనీషియేటివ్ ప్రకారం.. అమెరికాలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో క్యాంపస్‌లో నివసించడానికి, తరగతులకు హాజరు కావడానికి రాష్ట్ర విద్యార్థులకు వార్షిక సగటు ఖర్చు ఇది.
సంబంధిత కథనం