తెలుగు న్యూస్ / career /
MGU Nalgonda Recruitment : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు!
MGU Nalgonda Recruitment 2024 : నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పార్ట్ టైమ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రేపటితో అప్లికేషన్ల గడువు(డిసెంబర్ 28) పూర్తి అవుతుంది. మొత్తం 14 పార్ట్ టైమ్, గెస్ట్ ఫ్యాక్టలీ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉద్యోగాలు (image source https://mguniversity.ac.in/)
నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 14 పార్ట్‌టైమ్/ గెస్ట్ ఫ్యాకల్టీను రిక్రూట్ చేయనున్నారు. అయితే అప్లికేషన్ల గడువు రేపటితో(డిసెంబర్ 28, 2024)తో పూర్తి అవుతుంది. అర్హులైన అభ్యర్థులు రేపటిలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్య వివరాలు:
- ఈ నోటిఫికేషన్ లో భాగంగా… 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైమ్(పార్ట్‌టైమ్/ గెస్ట్ ఫ్యాకల్టీ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
- మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్(https://mguniversity.ac.in/) నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.
- అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీలోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
- పూర్తి చేసిన దరఖాస్తులను "ది రిజిస్ట్రార్, మహాత్మ గాంధీ యూనివర్శిటీ, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ -508 254’’కు పంపాల్సి ఉంటుంది.
- వివరాలు సరిగా లేకుంటే మీ అప్లికేషన్ ను పరిగణలోకి తీసుకోరు.
- అర్హత ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అకడమిక్ క్వాలిఫికేషన్స్ కు వెయిటేజీ ఇస్తారు.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీతో పాటు నెట్ లేదా సెట్, స్లెట్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పోస్టుల ఖాళీలు:
- ఎంఏ సైకాలజీ - 03 పోస్టులు
- ఎంఏఎకనామిక్స్ 01 పోస్టు
- ఎంఏ ఇంగ్లీష్: 02 ఖాళీలు
- ఎంఏ హిస్టరీ అండ్ టూరిజం - 1 పోస్టు
- బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - 03 పోస్టులు
- ఎంబీఏ (జనరల్)- 01
- ఎంబీఏ(టీటీఎం)- 2 ఖాళీలు
- ఎంబీఏ(ఇంటిగ్రేటెడ్)- 1 పోస్టు ఖాళీ ఉంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
సంబంధిత కథనం