UGC proposal: ఎంఈ లేదా ఎంటెక్ చేస్తే చాలు.. నెట్ అవసరం లేకుండా నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్!
UGC proposals: యూజీసీ తాజా ప్రతిపాదన ప్రకారం.. కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ME), లేదా మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ (M.Tech)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినవారు నెట్ అర్హత లేకుండానే నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి రిక్రూట్ అవుతారు.
UGC proposals: మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ME) లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (M.Tech)లలో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు సాధించిన వారిని నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ugc net) లో అర్హత సాధించాల్సిన అవసరం లేకుండా నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించుకునేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
వీసీలుగా మార్కెట్ నిపుణులు
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ వంటి రంగాలకు చెందిన పరిశ్రమ నిపుణులు, సీనియర్ ప్రొఫెషనల్స్ వైస్ ఛాన్సలర్లుగా నియామకానికి అర్హులని యూజీసీ ముసాయిదా నిబంధనలు సూచిస్తున్నాయి. ఇది ఉన్నత విద్యలో నాయకత్వ పాత్రలకు ప్రమాణాలను విస్తృతం చేస్తుంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అధ్యాపకులు, అకడమిక్ సిబ్బంది నియామకం, పదోన్నతులకు కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు చర్యలు) నిబంధనలు 2025 2018 మార్గదర్శకాల స్థానంలో ఉంటుందని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.
యూజీసీ ముసాయిదా నిబంధనలు 2025
భారత ఉన్నత విద్యలో అధ్యాపకుల నియామకం, పదోన్నతులను గణనీయంగా మార్చే ముసాయిదా నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆవిష్కరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక సబ్జెక్టులో పీహెచ్ డీ చేసిన అభ్యర్థులు తమ అత్యున్నత విద్యార్హత ఆధారంగా బోధించవచ్చు. ఉదాహరణకు కెమిస్ట్రీలో పీహెచ్ డీ, మ్యాథ్స్ లో బ్యాచిలర్, ఫిజిక్స్ లో మాస్టర్స్ చేసినవారు ఇప్పుడు కెమిస్ట్రీ బోధించడానికి అర్హత సాధిస్తారు. అంతేకాకుండా, తమ మునుపటి అకడమిక్ ఫోకస్ కు భిన్నమైన సబ్జెక్టులో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)లో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులు లేదా వారు మాస్టర్స్ చేసిన సబ్జెక్టును కూడా బోధించవచ్చు.
ఏపీఐ వ్యవస్థ తొలిగింపు
సృజనాత్మక బోధనా పద్ధతులు, డిజిటల్ కంటెంట్ సృష్టి, పరిశోధన నిధులకు సహకారం వంటి వృత్తిపరమైన విజయాలను గుర్తించే నిబంధనలను ప్రవేశపెట్టడం ద్వారా ముసాయిదా అర్హతల పరిధిని కూడా విస్తరించింది. యూజీసీ ప్రతిపాదిత ముసాయిదాలో గతంలో అధ్యాపకుల పదోన్నతులకు ఉపయోగించిన అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ (API) వ్యవస్థను తొలగించారు.
వైస్ చాన్స్ లర్ అర్హత
యూజీసీ ప్రతిపాదిత నిబంధనలు వైస్ చాన్స్ లర్ పదవికి అర్హతను విస్తృతం చేస్తాయి. పరిశ్రమ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కనీసం పదేళ్ల సీనియర్ స్థాయి అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ గణనీయమైన అకడమిక్ సహకారం అందించినట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఎంపిక ప్రక్రియలో మునుపటి పెద్ద కమిటీకి బదులుగా ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఉంటుంది. మరింత క్రమబద్ధమైన విధానాన్ని నిర్ధారిస్తుంది. ఈ ప్యానెల్లో విజిటర్ లేదా ఛాన్సలర్, యూజీసీ, యూనివర్సిటీ అపెక్స్ బాడీ నుంచి నామినీలు ఉంటారు.
అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి..
అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి పదోన్నతికి సంబంధించి కూడా నిబంధనలను సవరించారు. ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్, ఎడ్యుకేషన్, లా, సోషల్ సైన్సెస్, సైన్సెస్, లాంగ్వేజెస్, లైబ్రరీ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంజనీరింగ్/టెక్నాలజీ, మేనేజ్ మెంట్, డ్రామా, యోగా (YOGA), మ్యూజిక్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, స్కల్ప్చర్ తదితర సంప్రదాయ భారతీయ కళారూపాల సబ్జెక్టుల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పదోన్నతుల నిబంధనలను సవరించారు. పీర్-రివ్యూడ్ జర్నల్స్ లో కనీసం ఎనిమిది పరిశోధనా ప్రచురణలు లేదా ఎనిమిది పుస్తక అధ్యాయాల ప్రచురణ లేదా రచయితగా ఒక పుస్తకాన్ని ప్రచురించడం లేదా పేరున్న ప్రచురణకర్త ద్వారా సహ రచయితగా రెండు పుస్తకాలు ప్రచురించడం లేదా పేటెంట్లు పొందిన వారు అర్హులు.