నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ 2025) కౌన్సెలింగ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈరోజు, అంటే జులై 21న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రారంభించనుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీసీ నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం mcc.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్: జులై 21 నుంచి 28 వరకు (సర్వర్ సమయం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు).
పేమెంట్: జులై 28 మధ్యాహ్నం 3:00 గంటల వరకు (సర్వర్ సమయం ప్రకారం).
ఛాయిస్ ఫిల్లింగ్: జులై 22 నుంచి 28 వరకు (సర్వర్ సమయం ప్రకారం రాత్రి 11:55 గంటల వరకు).
ఛాయిస్ లాకింగ్: జులై 28న సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 11:55 గంటల వరకు (సర్వర్ సమయం ప్రకారం).
సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియ: జులై 29, 30.
సీట్ అలాట్‌మెంట్ ఫలితం: జులై 31.
రిపోర్టింగ్/జాయినింగ్: ఆగస్టు 1 నుంచి 6 వరకు.
ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా చేరిన అభ్యర్థుల డేటా వెరిఫికేషన్: ఆగస్టు 7, 8.
ఎంసీసీ నీట్ యూజీ కౌన్సెలింగ్ 2025ను మూడు రౌండ్లలో నిర్వహిస్తారు. ఆ తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. ఎంసీసీ నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ని తప్పకుండా చూడాలి.
స్టెప్ 1- MCC నీట్ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే "UG Medical" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ మీకు కనిపిస్తుంది.
స్టెప్ 4- ఆ లింక్‌పై క్లిక్ చేసి, అడిగిన వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 5- దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించండి.
స్టెప్ 6- "సబ్మిట్" పై క్లిక్ చేసి, ఆ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 7- భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింటౌట్‌ను తీసుకోవాలి.
రాష్ట్రాల 15 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు (MBBS/ BDS సీట్లు) (జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం భాగస్వామ్యం వారి సీట్ల కేటాయింపుకు లోబడి ఉంటుంది).
బీహెచ్‌యూలోని 100 శాతం MBBS/ BDS సీట్లు.
భారతదేశం అంతటా ఉన్న ఎయిమ్స్‌లోని 100 శాతం MBBS సీట్లు.
జిప్‌మెర్ సీట్లు 100 శాతం (పుదుచ్చేరి/ కరైకల్).
ఏఎమ్యూలోని 100 శాతం సీట్లు.
డీయూ, ఐపీ యూనివర్సిటీ (VMMC/ ABVIMS/ESIC Dental) లలోని 85 శాతం స్టేట్ కోటా సీట్లు.
ఫ్యాకల్టీ ఆఫ్ డెంటిస్ట్రీ (జామియా మిలియా ఇస్లామియా) లోని 100 శాతం సీట్లు, జామియా విద్యార్థుల కోసం 5 శాతం అంతర్గత కోటా సీట్లతో సహా!.
ఈఎస్ఐసీలోని 15 శాతం ఐ.పి. కోటా సీట్లు.
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం