Mahindra University PG Admissions : హైదరాబాద్ మహీంద్రా విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లను ప్రకటించింది. మహీంద్రా వర్సిటీలో ఎంటెక్, ఎంబీఏ, ఎంఏ(ఎడ్యుకేషన్), ఎల్ఎల్బీ (ఆనర్స్), కొత్తగా ప్రారంభిచిన ఎం.డీఈఎస్ & ఎంజేఎంసీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధిత పాఠ్యాంశాలు, విద్యా, పరిశ్రమలలో విస్తృత అనుభవం ఉన్న విశిష్ట అధ్యాపకులు, ప్రముఖ సంస్థలతో అంతర్జాతీయ సహకారాలతో డైనమిక్ లెర్నింగ్ ఎకోసిస్టమ్‌ను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపింది.
స్కూల్ ఆఫ్ డిజిటల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ రెండేళ్ల ఎంజేఎంసీ ప్రోగ్రామ్ ను అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ఏఆర్/వీఆర్, ఏఐ, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ వంటి కొత్త సాంకేతికత, మీడియా మేనేజ్‌మెంట్, వ్యూహాత్మక కమ్యూనికేషన్, ప్రకటనలు, పీఆర్, న్యూస్, ఏఐ, డేటా జర్నలిజం, ఫిల్మ్ మేకింగ్, డిజిటల్ వ్యూహం అందిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఇంజినీరింగ్ లేదా డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు అడ్మిషన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అడ్మిషన్ టెస్ట్‌కు బదులుగా సీయూసెట్ (PG), జీఆర్ఈ(జనరల్) స్కోర్‌లను అంగీకరిస్తారు.
స్కూల్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేషన్ రెండేళ్ల మాస్టర్ ఆఫ్ డిజైన్ (MDes) ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు సంబంధిత 4 సంవత్సరాల డిగ్రీ (ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, డిజైన్, ఇంటీరియర్ డిజైన్, బీఎఫ్ఏ, లేదా తత్సమానం) లేదా వృత్తిపరమైన అనుభవంతో కళలు, సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్‌లలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తుదారులు ప్రవేశ పరీక్ష తర్వాత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ప్రవేశ పరీక్షలకు బదులుగా CUET (PG), CEED స్కోర్‌లను అంగీకరిస్తారు.
మహీంద్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మెడూరి మాట్లాడుతూ...“మహీంద్రా వర్సిటీలో పీజీ ప్రోగ్రామ్‌లు పరిశోధన, ఆవిష్కరణ, ఇంటర్ డిసిప్లినరీ సహకారంతో రూపొందించామన్నారు. పరిశ్రమ భాగస్వామ్యాలు, సంబంధిత రంగాలలో అర్థవంతమైన ప్రభావాన్ని నిపుణులను పెంపొందించడం మా లక్ష్యం” అన్నారు.
మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇంటర్ డిసిప్లినరీ ఎంటెక్ ప్రోగ్రామ్ కంప్యూటర్-ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్ , అటానమస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ , వీఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్, స్మార్ట్ గ్రిడ్స్, ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ, సిస్టమ్స్ ఇంజినీరింగ్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ మెకానిక్స్, బయో-మెడికల్ డేటా సైన్సెస్ కొత్తగా ప్రారంభించబడిన అడ్వాన్స్‌డ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ వంటి ప్రత్యేకతలను అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏదైనా విభాగంలో కనీసం 55% మార్కులతో గ్రాడ్యుయేట్లు, బీఎడ్, లేదా B.El.Ed హోల్డర్లు లేదా NET లేదా CUCET (PG) స్కోర్‌లు లేదా ప్రవేశ పరీక్ష/ఇంటర్వ్యూతో అర్హత సాధించిన వారికి ఈ ప్రోగ్రామ్ లో ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల ఎల్ఎల్బీ (ఆనర్స్) ప్రోగ్రామ్, ఎంబీఏ ప్రోగ్రామ్ లకు దరఖాస్తులు ఆహ్వానించారు.
పీజీ అడ్మిషన్ టెస్ట్, తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూలో అద్భుతమైన పనితీరు ఆధారంగా, పీజీ అడ్మిషన్స్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థులకు కొన్ని పీజీ టీచింగ్ అసిస్టెంట్‌షిప్‌లను ప్రదానం చేయాలని సిఫార్సు చేయవచ్చు. (ఎల్ఎల్బీ (ఆనర్స్) ప్రోగ్రామ్‌కు వర్తించదు). పీజీ టీచింగ్ అసిస్టెంట్‌షిప్ నెలకు రూ. 18,000 స్టైఫండ్‌ను, (లేదా) క్యాంపస్‌లో ఉచిత బోర్డింగ్ కల్పిస్తారు.
సంబంధిత కథనం