Travelling jobs : ప్రపంచ యాత్రికుడు అవ్వాలంటే ఈ 5 జాబ్స్ బెస్ట్! ట్రావెల్ చేస్తూ సంపాదించొచ్చు..
మీరు ప్రయాణాలను ఇష్టపడతారా? కొత్త ప్రదేశాలను అన్వేషించగల వృత్తిపరమైన జీవితాన్ని కోరుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! ఫోర్బ్స్ రిపోర్టులో పేర్కొన్న 5 బెస్ట్ ట్రావెలింగ్ జాబ్స్‌పై ఓ లుక్కేయండి..
అడ్వెంచర్స్, థ్రిల్స్‌తో నిండిన జీవితాన్ని గడపడానికి అత్యంత ప్రత్యేకమైన మార్గాలలో ప్రయాణం ఒకటి! చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా, ట్రావెలింగ్‌పై అందరు ఆసక్తి చూపిస్తారు. కానీ చేస్తున్న ఉద్యోగాల కారణంగా ఈ కలను సాకారం చేసుకోవడానికి చాలా మందికి సమయం ఉండదు. అదృష్టవశాత్తూ ప్రపంచంలో కొన్ని వృత్తులు.. ప్రత్యేకంగా మన ట్రావెలింగ్ కలలను నేరవేర్చుకునే విధంగా ఉన్నాయి. అవి మిమ్మల్ని ప్రపంచ నలుమూలలకు తీసుకెళతాయి. మీరు త్వరలో కొత్త కెరీర్లోకి వెళుతున్నా, లేదా ఇంకా విద్యార్థి దశలో ఉండి ట్రావెలింగ్ కలలు కంటున్నా.. ఫోర్బ్స్ నివేదికలో జాబితా చేసిన ఈ థ్రిల్లింగ్ ఉద్యోగాలలో ఒకదాన్ని ఎంచుకోవడాన్ని పరిగణించండి. వీటితో ట్రావెలింగ్‌తో పాటు జీతం కూడా లభిస్తుంది!
- ఎయిర్‌లైన్ పైలట్..
ఎయిర్‌లైన్ పైలట్ ఉద్యోగం అంటే నిరంతరం ప్రయాణం చేయాల్సిన పని అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పైలట్‌గా, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విమానాలను నడపడానికి మీరు బాధ్యత వహిస్తారు. ఈ ఉద్యోగం మీకు పూర్తిగా కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.
పైలట్‌గా అర్హత సాధించాలంటే బ్యాచిలర్ డిగ్రీ, లైసెన్స్ పొందిన పైలట్ కావడానికి సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2. ఫ్లైట్ అటెండెంట్..
పైలట్ల మాదిరిగానే, ఫ్లైట్ అటెండెంట్లు కూడా తమ ఉద్యోగంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినా.. ఫ్లైట్ అటెండెంట్లు, వారి సేవలకు అనుగుణంగా, తరచుగా వివిధ ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఫ్లైట్ అటెండెంట్ కావడానికి అవసరమైన విద్యార్హతలతో పాటు సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ నుంచి శిక్షణ పొందాల్సి ఉంటుంది.
3. మేనేజ్మెంట్ కన్సల్టెంట్..
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అనేది ప్రయాణం అవసరమయ్యే మరొక ప్రొఫెషనల్ రంగం. "మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు దేశీయ లేదా అంతర్జాతీయ క్లయింట్లతో క్లోజ్‌గా పనిచేస్తారు, వ్యాపార పనితీరు, వ్యాపార ప్రక్రియలు, ఆదాయ ప్రవాహాలను పెంచడంతో కూడిన సంస్థాగత సమస్యలకు వ్యాపార పరిష్కారాలను అందిస్తారు."
మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కావడానికి కనీస అర్హతలు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
4. టూర్ గైడ్..
టూర్ గైడ్‌గా, ప్రపంచంలోని చారిత్రక, భౌగోళిక గమ్యస్థానాల గుండా సందర్శకులను నడిపించడం మీ ఉద్యోగ బాధ్యతగా ఉంటుంది. మీరు సాధారణంగా పర్యాటకులకు మార్గనిర్దేశం చేసే ప్రదేశాల గురించి వివరణాత్మక జ్ఞానాన్ని కలిగి ఉండాలి.
విజయవంతమైన టూర్ గైడ్ కావడానికి, మీకు అవసరమైన విద్యా మద్దతు, అధీకృత లైసెన్స్ అవసరం కావచ్చు.
5. ట్రావెల్ నర్స్..
ఫోర్బ్స్ నివేదిక నిర్వచించినట్లుగా.. “ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తక్కువగా ఉన్న వివిధ ప్రదేశాల్లో స్వల్పకాలిక కాంట్రాక్టుల్లో పనిచేసే రిజిస్టర్డ్ నర్సు”ను ట్రావెల్ నర్సు అంటారు.
వారి కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత, అటువంటి నర్సులు కొత్త ప్రదేశానికి, అవకాశాలకు వెళతారు లేదా అదే వైద్య సదుపాయంలో వారి బసను పొడిగిస్తారు అని ఫోర్బ్స్ తెలిపింది.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆడిటర్, ఫార్మాస్యూటికల్ సేల్స్ రిప్రజెంటేటివ్, కన్స్ట్రక్షన్ మేనేజర్, ప్రొఫెషనల్ ఇంటర్ప్రిటర్, డిప్లొమాట్ (ఫారిన్ సర్వీస్ ఆఫీసర్) వంటి ఇతర ఉద్యోగాలు కూడా ట్రావెలింగ్‌కి సహాయపడతాయి.
సంబంధిత కథనం