ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు దశాబ్దాల కాలంగా అమెరికా, యూకేలను ప్రిఫర్ చేస్తున్నారు. కానీ భౌగోళిక- రాజకీయ అనిశ్చితుల కారణంగా ఆయా దేశాలు కాకుండా, రానున్న రోజుల్లో భారతీయ విద్యార్థులు ఇతర ప్రత్యామ్నాయాలను వెత్తుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్, యూకేకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశాల వివరాలను, వీటిని ఎంచుకోవడానికి గల కారణాలను ఇక్కడ తెలుుసుకోండి..
జర్మనీ- ఉన్నత విద్యకు జర్మనీ అనాదిగా ప్రసిద్ధి! అంతర్జాతీయ విద్యార్థులు ఈ దేశానికి చదువు కోసం వెళుతుంటారు. ఇక్కడ జాతికి సంబంధం లేకుండా పబ్లిక్ యూనివర్సిటీలు ట్యూషన్ ఫీజును ఉచితంగా ఇస్తుంటాయి. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మునిచ్, లాడ్విగ్ మాక్సిమిలన్ యూనివర్సిటీ ఆఫ్ మునిచ్, హంబోల్డ్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, యూనివర్సిటీ ఆఫ్ బాన్ వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎటువంటి ట్యూషన్ ఫీజులను వసూలు చేయవు.
కెనడా- ఇటీవలి కాలంలో భారత్- కెనడా మద్య బంధం బలహీనపడినప్పటికీ, ఆ దేశాన్ని భారతీయులు ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ ట్యూషన్ ఫీజు చాలా తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. చదువు తర్వాత అనేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉండటం కారణం. అంతేకాదు వర్క్ పర్మిట్ ఉన్న ఉద్యోగులు స్టడీ పర్మిట్ లేకపోయినా చదువుకోవచ్చని కెనడా ఇటీవలే కొత్త పాలసీని తీసుకొచ్చింది.
ఆస్ట్రేలియా- న్యూజిలాండ్- స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్స్), బిజినెస్లో ఈ రెండు దేశాలు ముందంజలో ఉన్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు ఇక్కడ మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐర్లాండ్- థర్డ్ లెవల్ గ్రేడ్ స్కీమ్ కింద్ చదువు తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు రెండేళ్ల పాటు పని చేసుకునేందుకు ఐర్లాండ్ అవకాశాన్ని ఇస్తుంది. ఇదొక ప్లస్ పాయింట్. అంతేకాదు భద్రత విషయంలో ఐర్లాండ్ చాలా మెరుగైన దేశం.
నెథర్ల్యాండ్స్- బలమైన విద్యా వ్యవస్థ, అఫార్డిబుల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వంటి కారణాలతో నెథర్ల్యాండ్స్ కూడా అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ఆప్షన్ అవుతుంది. భద్రత విషయంలోనూ ఇది మెరుగైన దేశం.
ఆయా దేశాల్లో ట్యూషన్ ఫీజు 0 లేదా చాలా తక్కువగా ఉంటాయి. యూఎస్, యూకేలోని అనేక నగరాలతో పోల్చుకుంటే ఆయా దేశాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ! గణనీయంగా డబ్బులు ఆదా అవుతాయి. చదువు మాత్రమే కాదు, చదువు పూర్తైన తర్వాత అక్కడే ఉద్యోగం చేసి, ఎడ్యుకేషన్ లోన్ తీర్చుకోవాలని చాలా మంది చూస్తుంటారు. అలాంటి వారికి ఇవి మంచి ఆప్షన్ అవుతాయి. వీసా ప్రక్రియ కూడా సులభంగా, పారదర్శకంగా ఉంటుంది.
అయితే, ఏదైనా దేశాన్ని ఎంచుకునే ముందు, అక్కడి విద్యా వ్యవస్థ, చదువు అనంతరం ఉద్యోగ అవకాశాలను పూర్తిస్థాయిలో విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి.
సంబంధిత కథనం