ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 250 అప్రెంటిస్ పోస్టులు.. గ్రాడ్యుయేట్లకు మంచి ఛాన్స్.. జూలై 3న ఎగ్జామ్-lic hfl recruitment 2025 apply online for 250 apprentices posts check how to register ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 250 అప్రెంటిస్ పోస్టులు.. గ్రాడ్యుయేట్లకు మంచి ఛాన్స్.. జూలై 3న ఎగ్జామ్

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 250 అప్రెంటిస్ పోస్టులు.. గ్రాడ్యుయేట్లకు మంచి ఛాన్స్.. జూలై 3న ఎగ్జామ్

Anand Sai HT Telugu

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్‌లో బంపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో అప్రెంటిస్ పోస్టులు

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేరడం ద్వారా మీ కెరీర్‌ను మెుదలుపెట్టాలని అని అనుకుంటే మీకోసం మంచి ఛాన్స్ ఉంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్‌లో బంపర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటిస్‌షిప్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా మంచి స్టైఫండ్ లభిస్తుంది. ఈ నియామకం ద్వారా సంస్థలో 250 అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన అర్హతలు ఏంటో చూద్దాం..

అర్హతలు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ నియామక ప్రక్రియలో పాల్గొనగలరు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుము కేటగిరీ ప్రకారం ఉంటుంది. జనరల్/ఓబీసీ ఫీజు రూ. 944. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 708 ఫీజు చెల్లించాలి. అదే సమయంలో పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 472 ఫీజు చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష (జూలై 3, 2025న). దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

ముందుగా LIC HFL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

వెబ్‌సైట్ పైన మెనూ బార్‌లో ఇచ్చిన కెరీర్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లింక్‌పై క్లిక్ మీద చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.

అవసరమైన పత్రాలను (ఫోటో, సంతకం, విద్యా ధృవీకరణ పత్రం మొదలైనవి) అప్‌లోడ్ చేయండి.

ఆన్‌లైన్ మోడ్ ద్వారా మీ కేటగిరీ ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించండి.

చివరగా వివరాలను తనిఖీ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ప్రింటవుట్‌ను తీసుకోండి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్