LIC Golden Jubilee Scholarship: ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024; ఈ స్టూడెంట్స్ అర్హులు
విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) శుభవార్త తెలిపింది. 2024 సంవత్సరానికి గానూ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ స్కీమ్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10వ తరగతి, 12వ తరగతి, డిప్లోమా ల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ స్కాలర్ షిప్ లకు అప్లై చేసుకోవచ్చు.
LIC Golden Jubilee Scholarship 2024: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024ను ప్రారంభించింది. ఎల్ఐసీ గత కొన్నేళ్లుగా ఈ స్కాలర్ షిప్ ప్రొగ్రామ్ ను కొనసాగిస్తోంది. తాజాగా, 2024వ సంవత్సరానికి గానూ ఈ స్కీమ్ ను లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా స్కాలర్ షిప్ పొందాలనుకునే విద్యార్థులు డిసెంబర్ 22వ తేదీ లోగా, ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కోసం గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ ను ఎల్ఐసీ తీసుకువచ్చింది.
ఈ విద్యార్థులు అర్హులు..
ఈ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 ను పొందడానికి దేశవ్యాప్తంగా 10వ తరగతి/ 12వ తరగతి/ డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60% లేదా తత్సమాన CGPAతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ఈ పథకం గురించి శనివారం ఎల్ఐసీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లోవెల్లడించింది. అలాగే, ఈ స్కీమ్ కు సంబంధించిన వివరాలను తమ అధికారిక వెబ్ సైట్ www.licindia.in లో ఒక ప్రకటన ద్వారా వివరించింది.
లాస్ట్ డేట్ డిసెంబర్ 22
ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ కోసం డిసెంబర్ 8వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 22, 2024. ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆ తేదీలోపు పూర్తి చేయాలి. ‘‘ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ www.licindia.inలో హోమ్ పేజీలోని లింక్ ద్వారా ఆన్‌లైన్ లో మాత్రమే దరఖాస్తులను సమర్పించాలి" అని LIC తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ స్కాలర్‌షిప్ (scholarships) పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది.
LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 పూర్తి వివరాలు
- ఉన్నత చదువులు చదువుతున్న బాల, బాలికలకు జనరల్ స్కాలర్‌షిప్‌లు
- మెడిసిన్, ఇంజనీరింగ్, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సు లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న వారు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థలు లేదా పారిశ్రామిక శిక్షణా సంస్థలలో (ITI) కోర్సుల ద్వారా వృత్తిపరమైన కోర్సులు చదువుతున్న వారు.
- రెండు సంవత్సరాల ఏదైనా కోర్సు చదువుతున్న బాలికలకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు
- క్లాస్ XI & XII/ 10+2 నమూనా కింద ఇంటర్మీడియట్ చదువుతున్న వారు.
- Xth తర్వాత రెండేళ్లపాటు ఏదైనా ట్రేడ్ లో డిప్లొమా కోర్సు చదువుతున్న వారు.
స్కాలర్‌షిప్ ల కోసం విద్యార్థుల ఎంపిక ఇలా..
విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అతను అందించిన ఇమెయిల్ ఐడీపై ఒక రసీదుని పొందుతారు. రసీదు మెయిల్‌లో పేర్కొనబడిన ఎల్ఐసీ (LIC) డివిజనల్ కార్యాలయం ద్వారా తదుపరి ఉత్తరప్రత్యుత్తరాలు చేయబడతాయి. అభ్యర్థి తన సరైన ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను కమ్యూనికేషన్ కోసం అందించాలి.
బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు
విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన విద్యార్థులను గుర్తించి, ఎంపిక చేస్తారు. అనంతరం, వారికి సమాచారమిస్తారు. వారి నుంచి వారి బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తారు. వాటిలో బ్యాంక్ పేరు, అకౌంట్ నంబర్, బ్రాంచ్ పేరు, ఐఎఫ్ఎస్సీ, క్యాన్సిల్డ్ చెక్ లీఫ్ మొదలైనవి ఉంటాయి. అనంతరం, వారి బ్యాంక్ ఖాతాలో వారి స్కాలర్ షిప్ (student scholarships) మొత్తాన్ని జమ చేస్తారు. విలీనమైన బ్యాంకుల విషయంలో, బ్యాంకు యొక్క కొత్త IFSC కోడ్‌ను పేర్కొనాలి. ఆ బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. బ్యాంక్ ఖాతా కింద అనుమతించబడిన గరిష్ట బ్యాలెన్స్‌ను కూడా తనిఖీ చేయాలి.