AP High Court Jobs 2025 : ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూనే, దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!
AP High Court Recruitment 2025 Updates : ఏపీ హైకోర్టులో లా క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మరో రెండు రోజుల్లో(జనవరి 17) పూర్తి కానుంది. ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు ఏపీ హైకోర్టు వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు జనవరి 17వ తేదీతో పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటలలోపే పంపాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తుండటంతో… అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఖాళీల వివరాలు…
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం ఐదు లా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. ఎంపికై వారు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుకునే వారు ఐదేళ్లు లేదా మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18-30 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు విధానం లేదు. వివరాలతో పూర్తి చేసిన దరఖాస్తును రిజిస్ట్రార్, హైకోర్ట్ ఆఫ్ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్- 522239 చిరునామాకు పంపించాలి.
ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులను విద్యార్హతలు, మెరిట్ మార్కులు, వైవా వాయిస్(ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,000 వరకు జీతం ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
- లా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా https://aphc.gov.in/index.html వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
- హోం పేజీలో కనిపించే రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ క్లిక్ చేసే లా క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీనిపై నొక్కితే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఉంటాయి. ఇందులోనే చివరగా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ కాపీని పొందవచ్చు.
- దరఖాస్తు ఫామ్ లో మీ వివరాలను ఎంట్రీ చేసి "రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, గుంటూరు జిల్లా, పిన్ కోడ్- 522239" చిరునామాకు పోస్టు చేయాలి.
- లా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత కథనం