ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌ టిక్కెట్లపై లేటెస్ట్‌ అప్డేట్‌.. హాల్‌ టిక్కెట్లు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి…-latest update on ap inter advanced supplementary hall tickets download hall tickets ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌ టిక్కెట్లపై లేటెస్ట్‌ అప్డేట్‌.. హాల్‌ టిక్కెట్లు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి…

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌ టిక్కెట్లపై లేటెస్ట్‌ అప్డేట్‌.. హాల్‌ టిక్కెట్లు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి…

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్‌టిక్కెట్లను మే 6వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్‌,ఒకేషనల్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టిక్కెట్లు విడుదల

ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఇంటర్‌ ఫలితాలతో పాటు పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా హాల్‌ టిక్కెట్లను మంగళవారం విడుదల చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు.

అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల థియరీ పరీక్షలకు హాల్‌ టిక్కెట్లను కాలేజీ లాగిన్‌లలో అందుబాటులో ఉంచుతారు. కాలేజీ ప్రిన్సిపల్స్‌ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లోని లాగిన్‌ ద్వారా ఉదయం 11 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులు 2025 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌ టిక్కెట్ నంబర్‌తో పాటు ఆధార్‌ నంబర్‌ ను ఎంటర్ చేయడం ద్వారా వాట్సాప్‌ మన మిత్రలో కూడా నేరుగా హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం 95532 00009 నంబర్‌‌లో విద్య శాఖ సేవల్ని ఎంచుకుని హాల్‌ టిక్కెట్ పొందవచ్చు. విద్యార్థులు 2025 మార్చి హాల్‌ టిక్కెట్ నంబర్, ఆధార్‌ కార్డు నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..

ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏపీ ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపంది. మే 28 నుంచి జూన్‌ 1 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 4న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష , జూన్ 6న పర్యావరణ విద్య నిర్వహించనున్నారు.

ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

మొదటి సంవత్సరం టైమ్ టేబుల్ (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు)

12.05.2025 - 2nd లాంగ్వేజ్ పేపర్-1

13.05.2025 - ఇంగ్లీష్ పేపర్ -1

14.05.2025 - మ్యాథ్స్ పేపర్ -1A, బోటనీ పేపర్ -1, సివిక్స్ పేపర్ -1

15.05.2025 -మ్యాథ్స్ పేపర్ -1B, జువాలజీ-1, హిస్టరీ-1

16.05.2025 -ఫిజిక్స్ పేపర్ -1, ఎకానమిక్స్ పేపర్-1

17.05.2025 - కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1

19.05.2025 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ -1(బైపీసీ విద్యార్థులకు)

20.05.2025 -మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1

రెండో సంవత్సరం టైమ్ టేబుల్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు)

12.05.2025 - 2nd లాంగ్వేజ్ పేపర్ -2

13.05.2025 - ఇంగ్లీష్ పేపర్ -2

14.05.2025 - మ్యాథ్స్ పేపర్ -2A, బోటనీ పేపర్ -2, సివిక్స్ పేపర్ -2

15.05.2025 -మ్యాథ్స్ పేపర్ -2B, జువాలజీ-2, హిస్టరీ-2

16.05.2025 -ఫిజిక్స్ పేపర్ -2, ఎకానమిక్స్ పేపర్-2

17.05.2025 - కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్ -2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2

19.05.2025 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ -2(బైపీసీ విద్యార్థులకు)

20.05.2025 -మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం