సీఎస్ఐఆర్ నెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు-last date to apply for csir net 2025 extended register till june 26 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీఎస్ఐఆర్ నెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు

సీఎస్ఐఆర్ నెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు

Sudarshan V HT Telugu

సీఎస్ఐఆర్ నెట్ 2025 కు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సీఎస్ఐఆర్ నెట్ 2025 కు జూన్ 26వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ csirnet.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సీఎస్ఐఆర్ నెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR UGC NET 2025) కు దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. అభ్యర్థులు జూన్ 26 వరకు సీఎస్ఐఆర్ నెట్ అధికారిక వెబ్ సైట్ csirnet.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష జూలై 26 నుంచి 28 వరకు

సవరించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపునకు జూన్ 27 చివరి తేదీ కాగా, దరఖాస్తు ఫారం కరెక్షన్ విండో జూన్ 28న ప్రారంభమై జూన్ 29న ముగుస్తుంది. ఈ పరీక్ష జూలై 26 నుంచి 28 వరకు జరగనుంది. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారాల్లో తాము ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాల్లో ఏవైనా అస్పష్టత ఉంటే ఇంగ్లిష్ వెర్షన్ ను ఫైనల్ గా పరిగణిస్తామని ఎన్టీఏ తెలిపింది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ). పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూలు) మూడు భాగాలుగా ఉంటాయి. పేపర్ల మధ్య విరామం ఇవ్వరు.

సీఎస్ఐఆర్ నెట్ 2025 దరఖాస్తు విధానం

సీఎస్ఐఆర్ నెట్ 2025 కు అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ముందుగా, సీఎస్ఐఆర్ నెట్ 2025 అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
  • సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ ఎగ్జామ్ 2025 కోసం రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేయండి.
  • అభ్యర్థించిన సమాచారాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయండి.
  • ఇప్పుడు, మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
  • అప్లికేషన్ ఫామ్ నింపండి. డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫామ్ సబ్మిట్ చేయండి.
  • ధృవీకరణ పేజీ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.
  • ఒక అభ్యర్థి ఒక దరఖాస్తును మాత్రమే సమర్పించడానికి అనుమతించబడుతుంది. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారాలను సమర్పించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ తెలిపింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.

సీఎస్ఐఆర్ నెట్ 2025 కు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం