Kurnool Medical Jobs : క‌ర్నూలు జిల్లాలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన వివ‌రాలివే-kurnool district medical health department recruitment 19 posts key details inside ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Kurnool Medical Jobs : క‌ర్నూలు జిల్లాలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన వివ‌రాలివే

Kurnool Medical Jobs : క‌ర్నూలు జిల్లాలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన వివ‌రాలివే

HT Telugu Desk HT Telugu

Kurnool Medical Jobs : కర్నూలు జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తు దాఖలకు మార్చి 18 ఆఖరు తేదీగా నిర్ణయించారు.

క‌ర్నూలు జిల్లాలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన వివ‌రాలివే

Kurnool Medical Jobs : క‌ర్నూలు జిల్లాలో మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ మార్చి 18గా నిర్ణయించారు. ఆస‌క్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు స‌కాలంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప‌ద్దతుల్లో భ‌ర్తీ చేస్తున్నారు.

పోస్టులు ఎన్ని?

మొత్తం 19 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ల్యాబ్ టెక్నిషియ‌న్‌ (1), అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధతిలో థియేట‌ర్ అసిస్టెంట్ (4), జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) (10), పోస్టుమార్టం అసిస్టెంట్ (4) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

నెలవారీ జీతం

1. ల్యాబ్ టెక్నిషియ‌న్ (1)-రూ.32,670

2. థియేట‌ర్ అసిస్టెంట్ (4)- రూ.15,000

3. జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) (10) - రూ.15,000

4. పోస్టుమార్టం అసిస్టెంట్ (4)- రూ.15,000

అర్హత‌లు

అర్హత‌లు ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.

1. ల్యాబ్ టెక్నిషియ‌న్ః డీఎంఎల్‌టీ లేదా బీఎస్సీ (ఎంఎల్‌టీ), ఇంట‌ర్మీడియ‌ట్ (ఒకేష‌న‌ల్‌)తో ప్రభుత్వం హాస్పటల్స్‌లో ఏడాది పాటు అప్రెంటీషిప్ త‌ప్పనిస‌రి. ఏపీపీఎంబీలో రిజిస్ట్రర్ కావ‌డం త‌ప్ప‌ని స‌రి.

2. థియేట‌ర్ అసిస్టెంట్ : ప‌దో త‌ర‌గ‌తి

3. జనరల్ డ్యూటీ అటెండంట్ : ప‌దో త‌ర‌గ‌తి

4. పోస్టుమార్టం అసిస్టెంట్ : ప‌దో త‌ర‌గ‌తి

వ‌యో ప‌రిమితి

2025 జ‌న‌వ‌రి 1 నాటికి వ‌య‌స్సు 42 ఏళ్లలోపు మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థుల‌కు ఐదేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్యర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వ‌య‌స్సు దాట‌కూడ‌దు.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు : ఓసీ అభ్యర్థుల‌కు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, దివ్యాంగు అభ్యర్థుల‌కు అప్లికేష‌న్ ఫీజు మిన‌హాయింపు. ఫీజును A/c. No.037910011021843 with IFSC code: UBIN0803791, Union Bank of India, Byrmal Street Branch, Nandyal కి యూపీఐ ట్రాన్సఫ‌ర్‌, ఆర్‌టీజీఎస్‌, ఎన్ఈఎఫ్‌టీ చేయాలి.

ఎంపిక ప్రక్రియ‌

ఎంపిక ప్రక్రియ‌లో వంద మార్కులు ఉంటాయి. అందులో విద్యా అర్హత‌లోని స‌బ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభ‌వానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసిన‌ప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గ‌రిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు. అనుభ‌వానికి సంబంధించి మార్కుల‌ను కూడా గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్రతి ఆరు నెల‌ల‌కు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్రతి ఆరు నెల‌ల‌కు 2 మార్కులు కేటాయిస్తారు. ప‌ట్టణ ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక మార్కు కేటాయిస్తారు. ఆరు నెల‌ల కంటే త‌క్కువ ఉన్న స‌ర్వీసుకు ఎటువంటి వెయిటేజ్ ఇవ్వ‌రు.

జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికేట్

2. పోస్టుకు సంబంధించిన పాస్ స‌ర్టిఫికేట్స్‌

3. అర్హత ఎగ్జామ్‌కు సంబంధించిన ఫ్రూప్‌

4. అన్ని సంవ‌త్సరాల మార్కుల మెమో

5. ఏపీ పారా మెడిక‌ల్ బోర్డు, అల్లెడ్ హెల్త్ కేర్ సైన్స్‌లో రిజిస్టర్ అవ్వాలి.

6. నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్టడీ స‌ర్టిఫికేట్లు.

7. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

8. ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత స‌ర్టిఫ‌కేట్‌

9. దివ్యాంగు అభ్య‌ర్థులు స‌ద‌రం స‌ర్టిఫికేట్‌

10. స‌ర్వీస్ స‌ర్టిఫికేట్‌

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి?

ద‌ర‌ఖాస్తు ఫార‌మ్ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://cdn.s3waas.gov.in/s37f24d240521d99071c93af3917215ef7/uploads/2025/03/2025031261.pdf అందుబాటులో ఉంటుంది. అక్క‌డ నుంచి ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుతో పాటు విద్యార్హ‌త‌లు, ఉద్యోగ అనుభ‌వాలతో కూడిన జిరాక్స్ కాపీ సెట్‌ను O/o DCHS, Kurnool, Regional Training Centre(F), Near DMHO Office, Kurnool కు మార్చి 18 తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

అద‌న‌పు వివ‌రాలు (పోస్టుల వారీగా అర్హ‌త‌లు, రిజ‌ర్వేష‌న్లు త‌దిత‌ర అంశాలు)కు అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://cdn.s3waas.gov.in/s37f24d240521d99071c93af3917215ef7/uploads/2025/03/2025031210.pdf సంప్రదించాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం