TG LAWCET Counselling 2025 : టీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు - ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య వివరాలు-keu update about tg lawcet spot admissions 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Lawcet Counselling 2025 : టీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు - ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య వివరాలు

TG LAWCET Counselling 2025 : టీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు - ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య వివరాలు

టీజీ లాసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

టీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు 2025

తెలంగాణ లాసెట్ -2025 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు కాలేజీల పేర్లతో పాటు సీట్ల వివరాలను వెల్లడించింది. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈనెల 15 నుంచి స్పాట్ అడ్మిషన్లు…

  • ఎల్ఎల్ బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.
  • అక్టోబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించుకోవాలి,
  • ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అవుతుంది.
  • మొత్తం 22 కాలేజీల్లో స్పాట్ ప్రవేశాలు ఉంటాయి.
  • కాలేజీల వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ లింక్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
  • ధ్రువపత్రాల పరిశీలన తర్వాత సంబంధిత కాలేజీకి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది.
  • ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • స్పాట్ అడ్మిషన్లలో కూడా లాసెట్ ర్యాంక్ కార్డు కీలకంగా ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
  • స్పాట్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ లింక్స్ : https://lawcetadm.tgche.ac.in/spot/info/?cc=collegecode

కావాల్సిన ధ్రువపత్రాలు :

  • టీజీ లాసెట్ ర్యాంక్ కార్డు - 2025
  • పదో తరగతి మెమో
  • ఇంటర్మీడియట్ మెమో
  • డిగ్రీ ఒరిజినల్ మెమో
  • స్టడీ సర్టిఫికెట్స్
  • టీసీ
  • కుల ధ్రువీకరణపత్రం
  • రెసిడెన్స్ సర్టిఫికెట్
  • ఇతర సర్టిఫికెట్లు

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం