తెలంగాణ ఈఏపీ సెట్‌ కౌన్సిలింగ్‌పై కీలక అప్డేట్… జూన్‌లో అగ్రి, ఫార్మసీ ప్రవేశాలు..ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్ ఎప్పుడు అంటే?-keay updates on telangana eapcet 2025 counselling schedule ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ ఈఏపీ సెట్‌ కౌన్సిలింగ్‌పై కీలక అప్డేట్… జూన్‌లో అగ్రి, ఫార్మసీ ప్రవేశాలు..ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్ ఎప్పుడు అంటే?

తెలంగాణ ఈఏపీ సెట్‌ కౌన్సిలింగ్‌పై కీలక అప్డేట్… జూన్‌లో అగ్రి, ఫార్మసీ ప్రవేశాలు..ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్ ఎప్పుడు అంటే?

Sarath Chandra.B HT Telugu

తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025 ఫలితాలు వెలువడటంతో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌ను జూన్‌ నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇంజనీరింగ్ ప్రవేశాలు మాత్రం జూన్‌ నెలాఖర్లో కానీ జులై మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయి.

తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్

తెలంగాణలో ఇంజనీరింగ్ అడ్మిషన్లపై స్పష్టత వచ్చేసింది. ఈ ఏడాది ఈఏపీ సెట్‌ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలను జూన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలంగాణలో ఈఏపీ సెట్‌ కౌన్సె లింగ్‌లో భాగంగా అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలను జూన్ నెలలో ప్రారంభిస్తారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కాస్త ఆలస్యంగా మొదలవుతాయి.

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో జూన్‌ నెలాఖరులో కానీ జులై మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జూన్ 2న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలి తాలు వెలువడతాయి.జేఈఈ ఫలితాలు విడుదలైన తర్వాత ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

దేశ వ్యాప్తంగా జేఈఈ ప్రవేశాలను పూర్తి చేయడానికి నాలుగు విడతలలో జోసా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సిలింగ్‌ ముగిసిన తర్వాత ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

ముందే ఈఏపీ సెట్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తే. సీట్లు పొందిన విద్యార్థులు తర్వాత ఎన్‌ఐటీ, ఐఐటీల్లోకి చేరిపోతే ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతాయి. దీంతో జోసా కౌన్సిలింగ్‌ పూర్తైన తర్వాత తెలంగాణ ఈఏపీ సెట్‌ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జూన్ నెలాఖరులో లేదా జులై మొదటి వారంలో తెలంగాణలో ఈఏపీ సెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.కౌన్సిలింగ్‌ పూర్తైన తర్వాత ఆగస్టు మొదటి వారంలో ఇంజనీరింగ్ తరగతు లను ప్రారంభిస్తారు.

అగ్రి, ఫార్మా కోర్సులకు జులైలో తరగతులు

తెలంగాణలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ వారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఎప్‌ సెట్‌ ఫలితాలు వెలువడటంతో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

అగ్రికల్చర్‌ కోర్సులకు నోడల్ విశ్వవిద్యాలయమైన ఆచార్య జయశంకర్ వ్యవ సాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు షెడ్యూల్‌ నిర్ణయించింది. జూన్‌లో ప్రవేశాలను పూర్తిచేసి జులై నెలాఖరు నుంచి తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నారు.

2024-25లో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్ఆర్ఐ కోటా సీట్ల పెంపుదల వల్ల బీఎస్సీ వ్యవసాయ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, వ్యవసాయ ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య 1200కి పెరిగింది.

ఈ ఏడాది సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో కొత్త వ్యవసాయ కళాశాల లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో 120 సీట్ల మేరకు పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన వెస్టర్న్ విశ్వవిద్యాల యంతో కలిసి సంయుక్తంగా నిర్వహించే కోర్చు ద్వారా మరో 30 సీట్లు పెరుగుతాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివితేనే 15% రిజర్వేషన్లు

2025-28 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని భూమిలేని వ్యవసాయ కూలీలకు 15% సీట్లు ఇవ్వా లని వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణ యించింది. దీనికి ఉపాది హామీ కూలీలు పొందే జాబ్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని భావించారు.

జాబ్‌ కార్డుల్ని ప్రామాణికంగా తీసుకుంటే సమస్యలు వస్తాయని గుర్తించి భూమిలేని వ్యవసాయ కూలీల పిల్లలు.. ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసంలో ఎప్పుడైనా వరుసగా నాలుగేళ్ల పాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివితేనే 15% రిజర్వేషన్లను వర్తింప చేస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం