Kadapa Uranium Corporation : క‌డ‌ప యూరేనియం కార్పొరేష‌న్‌లో 32 అప్రెంటీస్ ఖాళీలు, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి-kadapa uranium corporation 32 apprentice vacancies apply now ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Kadapa Uranium Corporation : క‌డ‌ప యూరేనియం కార్పొరేష‌న్‌లో 32 అప్రెంటీస్ ఖాళీలు, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Kadapa Uranium Corporation : క‌డ‌ప యూరేనియం కార్పొరేష‌న్‌లో 32 అప్రెంటీస్ ఖాళీలు, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Updated Feb 08, 2025 04:58 PM IST

Kadapa Uranium Corporation : కడప యూరేనియం కార్పొరేషన్ లో 32 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీ లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 క‌డ‌ప యూరేనియం కార్పొరేష‌న్‌లో 32 అప్రెంటీస్ ఖాళీలు, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి
క‌డ‌ప యూరేనియం కార్పొరేష‌న్‌లో 32 అప్రెంటీస్ ఖాళీలు, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Kadapa Uranium Corporation : క‌డ‌ప యూరేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటీస్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికేట్లన్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకునేందుకు ఫిబ్రవ‌రి 12న ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు.

యూరేనియం కార్పొరేష‌న్‌లో ఫిట్టర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎల‌క్ట్రిక్‌), ట‌ర్నర్ / మెషినిస్ట్‌, మెకానిక‌ల్ డీజిల్‌, కార్పెంట‌ర్‌, ప్లంబ‌ర్ ట్రేడ్లలో 32 అప్రెంటీస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తు కోరుతున్నారు.

ట్రేడ్‌ల వారీగా ఖాళీలు

  • ఫిట్టర్ -9,
  • ఎల‌క్ట్రీషియ‌న్ -9,
  • వెల్డర్ (గ్యాస్ అండ్ ఎల‌క్ట్రిక్‌) -4,
  • ట‌ర్నర్ / మెషినిస్ట్ -3,
  • మెకానిక‌ల్ డీజిల్ -3,
  • కార్పెంట‌ర్ -2,
  • ప్లంబ‌ర్ -2
  • మొత్తం 32 ఖాళీలు

అర్హత‌లు

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత సాధించాలి. ఆయా ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ‌, ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటీస్ చేరిన వారు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అన‌ర్హులు.

వ‌యో ప‌రిమితి

ద‌ర‌ఖాస్తు చేసే అభ్యర్థుల వ‌య‌స్సు 2025 జ‌న‌వ‌రి 13 వ‌ర‌కు 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధ‌న‌ల మేర‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగు అభ్యర్థుల‌కు వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ‌

అప్రెంటీస్ షిప్‌కు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఐటీఐలో వ‌చ్చిన మార్కుల శాతాన్ని బ‌ట్టి ఎంపిక చేయ‌నున్నారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://www.apprenticeshipindia.gov.in/ లో రిజిస్ట్రేష‌న్ అవ్వాలి. తొలిత వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి రిజిస్ట్రేష‌న్ టాబ్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేష‌న్ ఓపెన్ అవుతోంది. అప్లికేష‌న్‌లో అడిగిన వివరాలు పొందుప‌రచాలి. అనంత‌రం రిజిస్ట్రార్ ఈ మెయిల్ ఐడీ క‌న్ఫ్మేష‌న్‌ మెయిల్ వ‌స్తుంది. అభ్యర్థి ఈ మెయిల్‌లో ఐడీలో లింక్‌ను క్లిక్ చేసి లాగ్ ఇన్ అవ్వాలి. అప్పుడు మ‌ళ్లీ అందులో అడిగిన వివ‌రాలు పొందుప‌ర‌చాలి.

ఆన్‌లైన్‌లో అప్లొడ్ చేయాల్సిన‌ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికేట్‌, ఐటీఐ స‌ర్టిఫికేట్‌

2. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

3. దివ్యాంగులైతే మెడిక‌ల్ స‌ర్టిఫికేట్‌

4. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత స‌ర్టిఫికేట్‌

5. ఫోటో అండ్ సిగ్నేచ‌ర్‌

6. ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు

7. ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ పాస్ బుక్‌

8. ప్రాజెక్టు ప్రభావిత అభ్యర్థులైతే భూ సేక‌ర‌ణ స‌ర్టిఫికేట్‌

అద‌న‌పు వివ‌రాలు

నోటిఫికేష‌న్‌కు సంబంధించి అద‌న‌పు వివ‌రాల కోసం ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://ucil.gov.in/pdf/job/Apprentice%20Advt.%20Notification%202024-25%20to%20be%20published%20in%20UCIL%20website.pdf ను క్లిక్ చేయాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం