JoSAA 2025 రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను జూన్ 14, 2025న విడుదల చేసింది జాయింట్ సీట్ అలాట్‌మెంట్ అథారిటీ. రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను అభ్యర్థులు జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
సీట్ అలాట్‌మెంట్ ఫలితాల విడుదల: జూన్ 14, 2025
ఆన్‌లైన్ రిపోర్టింగ్ (ఫీజు చెల్లింపు/ డాక్యుమెంట్ అప్‌లోడ్): జూన్ 14 నుంచి జూన్ 18, 2025 వరకు
ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 18, 2025
ఫీజు చెల్లింపు సమస్యల పరిష్కారం (చెల్లింపు గడువులోపు ప్రయత్నించిన వారికి): జూన్ 19, 2025 వరకు
ప్రశ్నలకు స్పందించడానికి చివరి తేదీ: జూన్ 20, 2025
జోసా 2025 రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు కింది స్టెప్స్‌ని అనుసరించవచ్చు..
స్టెప్ 1- జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in కి వెళ్లండి.
స్టెప్ 2- లింక్‌పై క్లిక్ చేయండి: హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న "JoSAA 2025 round 1 seat allotment result" లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- లాగిన్ వివరాలను నమోదు చేయండి: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
స్టెప్ 4- సబ్మి బటన్‌పై క్లిక్ చేయండి: "Submit" పై క్లిక్ చేయండి, మీ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ కనిపిస్తుంది.
స్టెప్ 5- రిజల్ట్ చెక్ చేసుకోండి: ఫలితాన్ని చెక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 6- హార్డ్ కాపీని భద్రపరచండి: భవిష్యత్ అవసరాల కోసం దాని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోండి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు జోసా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ చదివేందుకు జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయన వారు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లను కేటాయిస్తారు.
సంబంధిత కథనం