బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల్లో ఏపీలో 22 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, ఓబీసీలకు 5, ఈడబ్ల్యూఎస్‌లో 2, అన్ రిజర్వ్‌డ్‌లో 11, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 5 ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
తెలంగాణలో 13 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీలకు 2, ఓబీసీలకు 3, ఈడబ్ల్యూఎస్1, అన్ రిజర్వ్‌డ్ 7, ఎక్స్ సర్వీస్ మెన్ 3 పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి.
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ‌్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ఆఫీస్ సబార్డినేట్ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వేతన శ్రేణి రూ.19,500-రూ.37,815 మధ్య ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ శాలరీతో పాటు డిఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, స్పెషల్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, లీవ్ ఫేర్ కన్సెషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎయిడ్, గ్రాట్యూటీ, సీపీఎస్, స్టాఫ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, గృహ రుణ సదుపాయం, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ, ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి.
అభ్యర్థులు 18 నుంచి 26ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడేళ్లు, విధి నిర్వహణలో అవయవాలు కోల్పోయిన వికలాంగులకు గరిష్టంగా 8ఏళ్లు వయో పరిమితిలో మినహాయింపు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆర్నెల్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
రాత పరీక్షతో పాటు స్థానిక భాషలో ప్రావీణ్యంపై పరిశీలిస్తారు. అర్హులైన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఎంపికలో బ్యాంక్ యాజమాన్యం వివిధ రకాల పరీక్షల ద్వారా సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వ్రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అర్థమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్ లను నిర్వహిస్తారు. మొత్తం 100మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు తెలుగు, ఉర్దూలను స్థానిక భాషలుగా నిర్ణయించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్ లైన్ లో మే 5న ప్రారంభమై 2025 మే 23న ముగుస్తుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్ఎస్, మహిళా అభ్యర్థులకు రూ.100 ఫీజు చెల్లించాలి. నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి.
దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి.
సంబంధిత కథనం