ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిపికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా… ఈ సమయం దగ్గరపడింది. జూన్ 2వ తేదీతో ఈ గడువు ముగియనుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు… వారి విద్యా అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలని చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లోకలిపి మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. వీటిల్లో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) ఖాళీలు ఉండగా… ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. ఇవే కాకుండా ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, స్టెనో గ్రాఫర్, డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో కొన్నింటిని డిగ్రీ, మరికొన్నింటికి ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతలు ఉన్నాయి. డ్రైవర్ అభ్యర్థులకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా స్థానిక భాష వచ్చి ఉండాలి. అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్లకు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా భాషా తెలిసి ఉండాలి.అంతేకాకుండా వయసు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి. మొత్తం 10 రకాల పోస్టులు ఉండగా.. వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా అర్హతలు ఉన్నాయి. ఈ వివరాలను aphc.gov.in/recruitments వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
కోర్టు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలనుకునే వాళ్లు https://aphc.gov.in/recruitments.php వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. పార్టీ ఏ తో పాటు పార్ట్ బీ పూర్తి చేయాలి. పార్టీ ఏ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ వివరాలతో పార్ట్ బీలో ఉండే అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయవచ్చు.
పార్ట్ ఏలో జనరేట్ అయ్యే ఓటీపీఆర్ ఐడీతో పాటు రిజిస్ట్రేషన్ వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లతో పాటు రాత పరీక్ష తేదీలను కూడా ఈ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు. ఈ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు https://aphc.gov.in/recruitments.php లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. లేదా ఏపీ హైకోర్టు వెబ్ సైట్ లోకి వెళ్లి రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నోటిఫికేషషన్ వివరాలను తెలుసుకోవచ్చు.