Visakha Port Authority Training : విశాఖ పోర్టు, సీఈఎంఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ‌-పూర్తి వివ‌రాలివే-job training opportunity free courses for unemployed youth at visakhapatnam port ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Visakha Port Authority Training : విశాఖ పోర్టు, సీఈఎంఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ‌-పూర్తి వివ‌రాలివే

Visakha Port Authority Training : విశాఖ పోర్టు, సీఈఎంఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ‌-పూర్తి వివ‌రాలివే

HT Telugu Desk HT Telugu
Updated Feb 19, 2025 02:21 PM IST

Visakha Port Authority Training : విశాఖపట్నం పోర్టు అథారిటీ, సీఈఎంఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇన్వేంట‌రీ కంట్రోల‌ర్‌, వెల్డింగ్ కోర్సుల్లో రెండు నెల‌ల పాటు శిక్షణ ఇస్తారు. ఆసక్తి గలవారు ఈ నెల 20న పాడేరు పోలీస్ గ్రౌండ్‌లో జ‌రిగే శిబిరానికి హాజరవ్వాల

విశాఖ పోర్టు, సీఈఎంఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ‌-పూర్తి వివ‌రాలివే
విశాఖ పోర్టు, సీఈఎంఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ‌-పూర్తి వివ‌రాలివే

Visakha Port Authority Training : విశాఖ‌ప‌ట్నం పోర్టు అథారిటీ (వీపీఏ), సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైం షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్‌) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువ‌తకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇన్వేంట‌రీ కంట్రోల‌ర్‌, వెల్డింగ్ కోర్సుల్లో రెండు నెల‌ల పాటు ఉచిత వ‌స‌తితో పాటు శిక్షణ ఇస్తారు. ఆస‌క్తి, అర్హత ఉన్న నిరుద్యోగ యువ‌త నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నామ‌ని సీఈఎంఎస్‌ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ కె.సేతు మాధ‌వ‌న్ తెలిపారు.

ఈ ఉచిత శిక్షణ‌కు 27 ఏళ్ల లోపు వ‌య‌స్సు కలిగి, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, ఐటీఐ (వెల్డర్‌, ఫిట్టర్‌) ఉత్తీర్ణులైన యువ‌తీ, యువ‌కులు అర్హుల‌ని తెలిపారు. ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు ఈనెల 20వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు పాడేరు పోలీస్ గ్రౌండ్‌లో జ‌రిగే శిబిరానికి హాజ‌రుకావాల‌ని కె.సేతు మాధ‌వ‌న్ సూచించారు. ఈ శిబిరానికి హాజ‌ర‌య్యేట‌ప్పుడు విద్యార్హత‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, రేష‌న్ కార్డు, ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీల సెట్‌తో హాజ‌రుకావాల‌ని కోరారు.

మ‌రిన్ని పూర్తి వివ‌రాల కోసం 8688411100, 8331901237, 0891-2704010 ఫోన్ నెంబ‌ర్లను సంప్రదించాల‌ని కోరారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. ఈ శిక్షణ పూర్తి అయిన త‌రువాత స‌ర్టిఫికేట్ ఇస్తామ‌ని, త‌ద్వారా టెక్నిక‌ల్ ఉద్యోగాలకు వెళ్లేందుకు ఆ స‌ర్టిఫికేట్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులు ఈ శిక్షణ ద్వారా మంచి ఉద్యోగాలు పొంద‌వ‌చ్చని పేర్కొన్నారు. నిర్ణీత స‌మ‌యంలో అభ్యర్థులు హాజ‌రుకావాల‌ని సూచించారు.

స‌ర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

విశాఖ‌ప‌ట్నంలోని కంచ‌ర‌పాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్‌)లో నిర్వహిస్తున్న స‌ర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 24వ తేదీన ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంక‌ట‌ర‌మ‌ణ తెలిపారు. ఆస‌క్తి, అర్హత క‌లిగిన అభ్యర్థులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని ఆయ‌న కోరారు.

ఏఏ కోర్సుల్లో ఎన్ని సీట్లు?

2025-26 సంవ‌త్సరానికి ఏడాది కాల‌ వ్యవ‌ధి క‌లిగిన పారిశ్రామిక భ‌ద్రత కోర్సులో 60 సీట్లు, ఆరు నెల‌ల కాల వ్యవ‌ధితో ఫైర్ సేఫ్టీ కోర్సులో 30 సీట్లు, నాలుగు కాల వ్యవ‌ధితో ఆఫీస్ ఆటోమేష‌న్ కోర్సులో 20 సీట్లు, మూడు నెల‌ల కాల వ్యవ‌ధితో కెమిక‌ల్ సూప‌ర్ వైజ‌రీ ప్రొగ్రామ్‌లో 20 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు పదో త‌ర‌గ‌తి, డిప్లొమా, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హత‌, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రుకావ‌చ్చని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంక‌ట‌ర‌మ‌ణ పేర్కొన్నారు.

ఈనెల 24 తేదీన ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌య్యేట‌ప్పుడు విద్యా అర్హత స‌ర్టిఫికేట్లు, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు, రెండేళ్ల పారిశ్రామిక అనుభవ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఒరిజిన‌ల్‌తో పాటు ఒక సెట్ జెరాక్స్‌తో హాజ‌రుకావాల్సి ఉంటుంది. ఈనెల 24వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు నేరుగా కంచ‌ర‌పాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్‌) కార్యాల‌యానికి హాజ‌రు కావాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం