Krishna District : వైద్యారోగ్యశాఖలో 142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - మంచి జీతం, దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?
కృష్ణా జిల్లాలోని వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 142 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 23వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి.
కృష్ణా జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తును దాఖలు చేసుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 23గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, మచిలీపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పరిధిలో ఉన్న ఆరోగ్య సంస్థలలో వివిధ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
మొత్తం 142 ఖాళీలు….
మొత్తం 142 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 59, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 75, నర్సింగ్ కాలేజీలో 8 పోస్టులు ఉన్నాయి. అందులో 66 పోస్టులను కాంట్రాక్ట్, 76 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మొత్తం 27 రకాల విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు.
నెలవారీ వేతనంలో పోస్టును బట్టీ ఉంటుంది. రూ.61,960 నుంచి రూ.15,000 వరకు వివిధ స్థాయిల్లో ఉంటాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు తక్కువ జీతం ఉంది. విద్యా అర్హత కూడా ఒక్కొ విభాగంలోని ఉద్యోగాలకు ఒక్కొ విధంగా ఉంది. పదో తరగతి నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీటెక్ వరకు విద్యా అర్హత ఉంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వయస్సు దాటకూడదు. అప్లికేషన్ ఫీజు ఓసి అభ్యర్థులకు రూ.250 ఉంటుంది. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగు అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ షెడ్యూల్:
1. దరఖాస్తుల స్వీకరణః జనవరి 16 నుంచి జనవరి 23 (సాయంత్రం 5 గంటల) వరకు. కేవలం ఆఫీస్ పని దినాల్లోనే.
2. మెరిట్ లిస్ట్ విడుదలః ఫిబ్రవరి 15,2025
3. మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు, ఫిర్యాదులు చేసేందుకుః ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 17 వరకు
4. మెరిట్ లిస్ట్ విడుదలః ఫిబ్రవరి 24,2025
5. మళ్లీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదుకు అవకాశంః ఫిబ్రవరి 25
6. తుది జాబితా విడుదలః ఫిబ్రవరి 28,2025
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
దరఖాస్తు ఫారమ్ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3c399862d3b9d6b76c8436e924a68c45b/uploads/2025/01/2025010635.pdf అందుబాటులో ఉంటుంది. ఇక్కడ్నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేసి మచిలీపట్నం ఎస్‌పివీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో జనవరి 23 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి.
అదనపు వివరాలు (విద్యా అర్హతలు, వేతనాలు, దరఖాస్తుకు జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాల గురించి)కు అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://cdn.s3waas.gov.in/s3c399862d3b9d6b76c8436e924a68c45b/uploads/2025/01/2025010633.pdf సంప్రదిచాలి.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం