OU Campus Job Mela 2025 : ఉస్మానియా యూనివర్శిటీలో జాబ్ మేళా - ఖాళీల వివరాలివే
Job Mela in Osmania University 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈనెల 28వ తేదీన ఉస్మానియా వర్శిటీ క్యాంపస్ లో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నారు. మొత్తం 125 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు వారి ధ్రువపత్రాలతో ఈ మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 7799884909ను సంప్రదించవచ్చు.
ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకో శుభవార్త వచ్చేసింది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లో జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అర్హులైన వారు జనవరి 28వ తేదీన వారి సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.

మొత్తం 125 ఖాళీలు….
ఈ ఉద్యోగ మేళాలో మొత్తం 125 పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఇందులో మెకానిక్ ఉద్యోగాలు 25 ఉండగా, సర్వీస్ అడ్వజైర్స్ ఖాళీలు 50 ఉన్నాయి. రిలేషన్ షిప్ మేనేజర్ ఖాళీలు కూడా మరో 50 ఉన్నాయి. మెకానిక్ ఉద్యోగాలకు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సర్వీస్ అడ్వజైర్స్ కు బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్, రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎంపికైన వారికి రూ. 11 వేల నుంచి 20 వేల వరకు జీతం చెల్లిస్తారు. వీరంతా కూడా హైదరాబాద్ వేదికగా పని చేయాల్సి ఉంటుంది.
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లో మిత్రా ఏజెన్సీస్ (మారుతీ సుజుకీ) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ మేళా ఉంటుంది. దరఖాస్తుదారులు 18 నుంచి 35 సంవత్సరాల లోపు గల వారు ఉండాలి. ఈ మేళాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 7799884909ను సంప్రదించవచ్చు.
వరంగల్ నిట్ క్యాంపస్ లో ఉద్యోగాలు:
వరంగల్ నిట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్ చేయనున్నారు.ఎంపికైన వారు ఏడాది కాలం పాటు పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - నిట్ వరంగల్,
- మొత్తం ఖాళీలు - 06
- ఖాళీల వివరాలు : విజిటింగ్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వైజర్)- 01, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ - 1, విజిటింగ్ కన్సల్టెంట్ (ఆర్కిటెక్ట్ - 01, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ - 01, స్టూడెంట్ కౌన్సెలర్ - 01,. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ -1
- ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
- దరఖాస్తులకు చివరి తేదీ - ఫిబ్రవరి 07, 2025.
- ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
- ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచారు
- అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/Careers/
సంబంధిత కథనం