JEE Mains Answer Key : జేఈఈ మెయిన్స్ సెషన్ 2 'ఆన్సర్ కీ'లో తప్పులు ఉన్నాయా?
JEE mains session 2 answer key : జేఈఈ మెయిన్స్ సెషన్ 2 'ఆన్సర్ కీ'కి సంబంధించిన అబ్జెక్షనల్ విండో నేటితో ముగియనుంది. సమాధానాలపై అభ్యంతరాలు తెలియజేయడానికి డైరెక్ట్ లింక్‌తో పాటు పూర్తి ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఆన్సర్ కీ 2025లో అభ్యంతరాలు ఉన్నాయా? వాటిని సవాలు చేసేందుకు ఈరోజే లాస్ట్ డేట్. సెషన్ 2కి సంబంధించిన అబ్జెక్షన్ విండోను ఎన్టీఏ నేడు మూసివేయనుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పేపర్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీని 2025 ఏప్రిల్ 11న విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ రోజు రాత్రి 11.50 గంటలకు గడువు ముగియనుంది.
“పేపర్ 1 (బీఈ- బీటెక్) ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్, క్వశ్చన్ పేపర్లను jeemain.nta.nic.in లో అప్లోడ్ చేశాము. ప్రొవిజనల్ ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలపాలనుకునే అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ. 200లు చెల్లించి సవాలు చేయవచ్చు,” అని అధికారిక ప్రకటనలో ఉంది.
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2025 సెషన్ 2పై అభ్యంతరాలను తెలియజేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అభ్యంతరాలను ఎలా నమోదు చేయండి..
ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ని అనుసరించవచ్చు.
1. jeemain.nta.nic.in ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2025 సెషన్ 2 అబ్జెక్షన్ విండో లింక్‌పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఆన్సర్ కీ కనిపిస్తుంది.
5. ఆన్సర్ కీని చెక్ చేసి, మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటున్న సమాధానంపై క్లిక్ చేయండి.
6. సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
7. సబ్మిట్పై క్లిక్ చేసి మీ అభ్యంతరాలను నింపాలి.
8. కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని, తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
ఫీజును డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏప్రిల్ 13, 2025 వరకు (రాత్రి 11:50 గంటల వరకు) చెల్లించవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకుండా ఎలాంటి ఛాలెంజ్‌ని స్వీకరించరు. ఛాలెంజ్‌కు సంబంధించిన రుసుమును మరే ఇతర పద్ధతి ద్వారా స్వీకరించరు.
ఎన్టీఏ జేఈఈ మెయిన్ సెషన్ 2 పేపర్-1 ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా 285 నగరాల్లో, భారత్ వెలుపల 15 నగరాల్లోని 531 కేంద్రాల్లో జరిగింది. పేపర్-2 పరీక్షను 2025 ఏప్రిల్ 9న నిర్వహించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
సంబంధిత కథనం