JEE Mains 2025 session 2 : జేఈఈ మెయిన్స్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..
JEE Mains 2025 session 2 registration : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. జేఈఈ మెయిన్స్ 2025 రెండో సెషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్- జేఈఈ మెయిన్స్ 2025 రెండో సెషన్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కీలక అలర్ట్! జేఈఈ మెయిన్స్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

జేఈఈ మెయిన్స్ 2వ సెషన్ రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ ఫిబ్రవరి 25 అని గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2: ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు విండో ముగింపు: ఫిబ్రవరి 25 (రాత్రి 9 గంటలు)
- ఫీజు చెల్లింపు విండో ముగింపు: ఫిబ్రవరి 25 (రాత్రి 11:50)
- పరీక్ష తేదీలు: ఏప్రిల్ 1 నుంచి 8 వరకు
పేపర్ల వారీగా షెడ్యూల్, ఎగ్జామ్ సిటీ, అడ్మిట్ కార్డు, రిజల్ట్ డిక్లరేషన్ తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటిస్తుంది.
జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1కు హాజరై రెండో సెషన్‌కి కూడా హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ పాత అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పేపర్, పరీక్ష మాధ్యమం, సిటీ ప్రిఫరెన్స్ కూడా మార్చుకోవచ్చు!
జేఈఈ మెయిన్స్ సెషన్-2 కోసం అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఒక అభ్యర్థి కేవలం ఒక దరఖాస్తు ఫారాన్ని మాత్రమే నింపడానికి అనుమతి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ నంబర్లు కలిగి ఉన్నట్లు తేలిన వారి అప్లికేషన్ని రద్దు చేస్తారు.
జేఈఈ మెయిన్స్ సెషన్-2కు దరఖాస్తు చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011-40759000, 011-69227700 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా jeemain@nta.ac.in ఈ-మెయిల్ కూడా చేయవచ్చు.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 జేఈఈ మెయిన్ సెషన్
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఇలా..
జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1.. జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జరిగింది.
284 నగరాల్లోని 598 కేంద్రాల్లో సుమారు 13 లక్షల మంది అభ్యర్థులకు సెషన్-1 నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మొత్తం హాజరు 94.5 శాతంగా నమోదైంది.
పరీక్ష బులెటిన్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి సెషన్ 1 ఫలితాలను ప్రకటిస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఈ జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతియేటా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు.
సంబంధిత కథనం