JEE Mains 2025: జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..-jee mains 2025 results out at jeemain nta nic in steps to download score cards ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Jee Mains 2025: జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

JEE Mains 2025: జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu
Published Feb 11, 2025 05:41 PM IST

JEE Mains 2025: జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను ఎన్టీఏ మంగళవారం విడుదల చేసింది. ఫలితాలను అభ్యర్థులు జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల వెల్లడి
జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల వెల్లడి (HT file)

JEE Mains 2025: జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలను 2025 ఫిబ్రవరి 11న అధికారిక వెబ్సైట్ లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

జనవరి లో పరీక్షలు

జేఈఈ మెయిన్ సెషన్ 1 పేపర్ 1 (బీఈ/బీటెక్)ను జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఎన్టీఏ నిర్వహించింది. బీ ఆర్క్, బీ ప్లానింగ్ కోసం పేపర్ 2 ను జనవరి 30 న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహించింది.

అభ్యంతరాలను లేవనెత్తడంపై

జేఈఈ మెయిన్స్ 2025 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఫిబ్రవరి 4, 2025న విడుదల చేయగా, అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 6 వరకు ప్రాథమిక కీని సవాలు చేయడానికి తమ అభ్యర్థనను పంపాలని కోరారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపేందుకు ప్రతి ప్రశ్నకు రూ.200 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ 2025 ఫైనల్ ఆన్సర్ కీని ఫిబ్రవరి 10, 2025న ఎన్టీఏ విడుదల చేసింది.

జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలను ఇలా చెక్ చేయండి..

జేఈఈ మెయిన్స్ 2025 స్కోర్ కార్డును డౌన్లోడ్ చేయడానికి, అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు:

  • అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in సందర్శించండి.
  • హోమ్ పేజీలో, జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
  • లాగిన్ అవ్వడానికి మీ వివరాలను నమోదు చేయండి.
  • మీ జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • ఫలితాన్ని డౌన్ లోడ్ చేసుకుని, భవిష్యత్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ ను ఉంచుకోండి.
  • మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

12 ప్రశ్నల తొలగింపు.

అభ్యంతరాలను పరిశీలించిన సబ్జెక్టు నిపుణులు తుది ఆన్సర్ కీ నుంచి వివిధ షిఫ్టుల్లో అడిగిన 12 ప్రశ్నలను తొలగించారు. నిబంధనల ప్రకారం ప్రశ్నలను తొలగించిన షిఫ్ట్ లో పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ ఆ ప్రశ్నలకు పూర్తి మార్కులు వస్తాయి. జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ 2025 ఏప్రిల్లో జరగనుంది. ఒక అభ్యర్థి ఏడాదిలో ఒకటి లేదా రెండు సెషన్ల జేఈఈ మెయిన్స్ కు హాజరు కావచ్చు. ఒక అభ్యర్థి రెండు సెషన్లలో జేఈఈ మెయిన్స్ రాసినట్లయితే, రెండు స్కోర్లలో ఉత్తమ స్కోరును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్ 2025 ఏసీ జాబితాను తయారు చేసి సెషన్ 2 పరీక్ష తర్వాతే విడుదల చేస్తారు. పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా ఎన్టీఏ వెబ్సైట్లను (jeemain.nta.nic.in, nta.ac.in) చూసుకోవాలి.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం