JEE Main Admit Card 2025: జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
JEE Main Admit Card 2025: జేఈఈ మెయిన్స్ 2025 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 పరీక్ష 2025 జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో జరుగుతుంది.
JEE Main Admit Card 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ జనవరి 22, 23, 24 పరీక్ష తేదీలకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్ 1 అడ్మిట్ కార్డు 2025ను విడుదల చేసింది. ఈ పరీక్ష తేదీల్లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ద్వారా హాల్ టికెట్ ను చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఎలా
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
1.జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో ఉన్న జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025 లింక్ పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది.
5. అడ్మిట్ కార్డును చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
జనవరి 22 నుంచి..
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షను 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో పేపర్ 1 (బీఈ/బీటెక్), పేపర్-2 (బీఆర్క్, బీప్లానింగ్) రెండు పేపర్లు ఉంటాయి. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష పేపర్ 1 ను 2025 జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో నిర్వహిస్తారు. పేపర్-2 ను జనవరి 30న నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పేపర్-2 రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతాయి.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో..
పరీక్ష ఆన్ లైన్, ఆఫ్ లైన్ మోడ్ లో జరుగుతుంది.
ఎ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)' విధానంలో పేపర్ 1 (బీఈ/బీటెక్).
బి) పేపర్ 2ఎ (బి. ఆర్క్): మ్యాథ్స్ (పార్ట్-1), ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) "కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి)" విధానంలో, డ్రాయింగ్ టెస్ట్ (పార్ట్-3) పెన్ను మరియు పేపర్ (ఆఫ్లైన్) మోడ్లో, ఎ4 సైజు డ్రాయింగ్ షీట్ పై ప్రయత్నించాలి.
సి) పేపర్ 2బీ (బి. ప్లానింగ్): కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో మ్యాథమెటిక్స్ (పార్ట్-1), ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2), ప్లానింగ్ బేస్డ్ ప్రశ్నలు (పార్ట్-3).